Saturday, June 06, 2009

యమహా నగరీ ముంబై మహా పురీ .... 4 వ భాగం

ముంబై నగర ప్రత్యేకం...లోకల్ రైలు నెట్ వర్క్ :
ఈ నగరానికి ఒక ప్రత్యేకత తెచ్చినది ఈ ట్రైన్ నెట్ వర్క్. ఈ ట్రైన్లలో ప్రయాణం జీవితాంతం ఎవరికైనా గుర్తుండే అనుభవమే అనుకో వచ్చు.
ముంబై ఒక మహా కాయ మైతే.
.దానిని నడిపే ధమనులు సిరలు ఈ లోకల్ నెట్ వర్క్.ఈ నెట్వర్క్ లో రోజుకి ప్రయాణం చేసే వారి సంఖ్య దాదాపు 60 లక్షలు .రెండు వేలకు పైగా ఈ సర్వీసులు మూడు జోన్ లలో తిరుగుతాయి.
వెస్ట్ ,సెంట్రల్,హార్బర్ లైన్ అనే మూడు జోన్ లలో ఈ ట్రైన్లు తిరుగుతాయి. వెస్ట్ ,సెంటర్ల్ లలో ఫాస్ట్ & స్లో రెండు రకాల బళ్ళు తిరుగుతుండగా హార్బర్ లైన్ లో స్లో బళ్ళు మాత్రమె తిరుగుతాయి.
ఒక్కొక్క బండి సరాసరి
కనీస పౌనహ్ పున్యం ౩ ని. తెల్లవారుఝామున ౩ గం .కి మొదలయ్యే ఈ ప్రయాణం రాత్రి 1.30 గం. దాక కొనసాగుతుంది.
చర్చ్ గేటు నుంచి డహాను (120 కి మీ ) వెస్ట్ లోనూ, సి ఏస్ టీనుంచి ఖోపోలి/కసార(120 కిమీ ) సెంట్రల్ లో మరియు
సి ఏస్ టీ నుంచి పన్వెల్ (50 కిమీ) హార్బర్ లైన్లలో నడుస్తాయి.
ఒక్కొక్క రైలు పెట్టె క్షమత 100 మంది ప్రయాణికులైతే ౩౦౦ మంది దాక ఈ పెట్టెలలో ప్రయాణిస్తారు.చిత్రం చూస్తె మీకే అవగతమవుతుంది.ఆడామగా, పిల్లామేకా (ఏదో ప్రాస కోసం) అందరూ ఇక్కడ వేళ్ళాడే వాళ్ళే .




No comments:

Post a Comment