
లోకల్ ట్రైనూ... ఎంటర్టేయ్న్మెంటూ....
ఈ లోకల్ ట్రైన్ ఉంది చూసారు...కొత్తలో మీకు చీకాకు గానే ఉండొచ్చు ... కాని ఒక పది సార్లు ఎక్కితే మరి వింతత జిత జిత లాగ ..భలే ఎక్సుపీరిఎన్స్ అంటారు.బయట వేళ్ళాడే వాళ్లు,ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తగువులాడే వాళ్లు,కూర్చుని నిల్చుని నిద్రలో జోగే వాళ్లు(దాదాపుగా ఎనభై శాతం), 4 గో సీటు ప్రయాణం (సెకండ్ క్లాసు కంపార్ట్మెంట్ లలో ఒక బెర్త్ లో ముగ్గురికి మాత్రమె కూర్చోడానికి స్థలం నిర్దేసించబడింది ;కాని నాల్గో వాడు కూడా కూర్చుంటాడు..ఫస్ట్ క్లాస్ కి తూచ్..ముగ్గురే ),విండో సీట్ కి కుమ్ములాట (అదీ ట్రైన్ వెళ్ళే డైరక్షన్ కి రివెర్స్ లో),ఆఆ హః ఆ హ్హ ఆ ఎక్కే వాళ్ల వేగం చూడాలీ ..!ఎ కే 47 బుల్లెట్ కి కూడా ఆ విసురు ఉండదేమో మరి..
జనాల ఎక్స్ ప్రెషన్ చూడాలి...ఆ కళ్ళల్లో ఖాళీ సీట్ తప్ప వేరే కనపడితే ఒట్టుస్మీ!ఇంకా చెప్పాల్సింది ఇంకొకటి ఉంది.. అదే భజన మండలులు..!
ప్రతీ లోకల్ లో కనీసం 2 భజన మండలులైన ఉంటాయి..సాధారణంగా ముందునుంచీ వెనకనుంచి రెండో కంపార్ట్మెంట్లలో ఈ మండలులు ఉంటాయి.లోకల్ మొదలైన స్టేషన్ నుంచి ఆఖరి స్టేషన్ దాక భజనలు సాగుతూనే ఉంటాయి.గణపతి, దేవి, శివుడు అలా సకల దేవత ప్రార్థనలు ఆ రెండు మూడు గంటల ప్రయాణంలో మనం వినొచ్చు.
ఒక విధ మైన వైబ్రషన్ ఆ ప్రదేశం లో మనకి ఫీలింగ్ కనబడ్తుంది.
సాధారణంగా అన్ని లోకల్ లలో వేళ్ళాడుతున్న /కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకరు ములుంద్ స్టేషన్ వచ్చినప్పుడు "గణపతి బప్పా మొరయ మంగళ మూర్తి మొరయ..ఉన్దీర్ మామకి జై...భారత్ మాట కి జై ..!వందే మాతరం !జై శివాజీ !జై భవాని..."ఇలా అరుస్తారు...అక్కడొక గణపతి ఆలయఓ ఉంది. అదే కాకుండా ఆ సమయం లోకల్ లోఅప్పటి దాక కూర్చుని ఉన్నవాళ్ళు నిల్చుని ఉన్న వాళ్ళకి జాగా ఇస్తారు.
ఇది సెంట్రల్ లైన్ లో జరిగే రోజువారీ తతంగం .హార్బర్ లైన్ లో అయితే ఇలాటి విషయం నేను గమనించ లేదు ...కాని వెస్ట్రన్ లైన్ లో మళ్ళా ఇలాంటి ఖాళి చేసి చోటివ్వడం ఉంది.
అన్నిటి కన్నా హార్బర్ లైన్ లో ప్రయాణం ఈజీ,తరవాత మరి సెంట్రల్ లైన్..మరీ మ్మరి క్లిష్టమైనది వెస్ట్రన్ లైన్..ఎందుకంటే ఇక్కడ డోర్లన్నీ వేళ్ళాడే వాళ్ళు మూసేసి ఉంచుతారు...వాళ్లకి అదొక ఆనందం...అందరికీ గాలి కావాలి కాబోలు..ఎక్కే వాళ్ళకీ దిగే వాళ్లకి ఒక మనిషి పట్టే జాగా మాత్రం ఇస్తారు..అయా తర్వాత మీ ఇష్టం..నే చెప్పేదేంటంటే ఎప్పుడైనా లోకల్ లో వెళ్ళాలంటే రివర్సు లో వెళ్ళండి (కొత్తగా వచ్చే వాళ్లకి మాత్రమె) అంటే సౌత్ నుంచి నార్త్ కి పగటి పూట నార్త్ నుంచి సౌత్ కి సాయంత్రం పూట...ఎందుకంటే ఎక్కువ ఆఫీస్ లు సౌత్ ముంబై లో ఉన్నాయ్.సో అర్థం చేసుకోండి.ఇంకోకటిప్పు....ఆది వారం మాత్రం మీరు తిరుగుడు కార్యక్రమం పెట్టుకోకండీ...ఎందుకంటే జనాలకి ఆటవిడుపు ఆరోజే కాబట్టీ అన్ని వైపులా గర్దీ ఎక్కువ ఉంటుంది.
మీ ముంబై టపాలన్నీ చదివా.నేను ముంబాయ్ వచ్చినపుడు 3 సార్లు మహానగర్ టూర్ వెళ్ళా.ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా తిప్పుతారు.మీ టపా చదువుతుంటే నా జ్ఞాపకాలు తిరిగి వచ్చాయ్.
ReplyDeleteoho yem maha bhagyam
ReplyDelete