Saturday, September 19, 2009

కాలరు (పిట్ట కథ)

కాలరేగారేద్దమనుకొనే వాళ్ళకీ ఒక మచ్చుకి చిన్న కథ  మా వూళ్ళో కాలరేగరేసుకు  తిరగడమంటే  ఏ భాద్యత లేకుండా గర్వంగా    తిరగడం అనీ  .....
 నెక్స్ట్ .....మన కధ రాఘవ గాడి గురించి ...వాడు కాసింత పెద్దైన తర్వాత వాళ్ళ నాన్న జుబ్బాల  స్థానే ఒక చొక్కా ...కాలరున్న చొక్కా కొన్నాడు...వాడికి ఆ షర్ట్  కాలరు కొంత కొత్తగా కాస్త విచిత్రంగా కనిపించింది.చూడ్డవే తడవు దాన్ని నిలబెట్టి ఎగేసి చూడమని ప్రయత్నిస్తూంటే...ఇంతలొ వాళ్ళమ్మ చూసీ ...ఒరే నాన్నా ఆ కాలర్ ఎగేయ్యడానికి ఇంకా సమయం ఉంది ఒహ సారి స్కూలు కి వెళ్లి ఉద్ధరించిన తరవాత పైకెత్తుకున్దువు గాని ఇప్పటికి దించు అని గదిమేసింది.పాపం వెర్రి  వెధవాయి అలాగే అని మరి స్కూల్లో చేరిందాక ఊరుకున్నాడు.మరి తర్వాత ఒకటో కళాస్ కి వెళ్ళిన  తర్వాత వాడికి మల్లి కాలరు విషయం గుర్తుకొచ్చింది మళ్లీ ఈ సారి ఒక్క సారి ఎత్తుకుందామని చేయి వేసే సరికి మాస్టర్ గాఠిగ కేక లేసారు' భడవాకాన వేలెడంత లేవు అప్పుడే కాలర్  లేపుతావా ? ముందు ప్రైమరీ స్కూల్ నుంచి బయటికెళ్ళి తర్వాత కాలరు గురుంచి ఆలోచించ' నీ  ...!ఉసూరు మని మళ్ళీ   కాలరు కిందకి వచ్చింది.
మొత్తానికి ఒక ఐదేళ్ళలో ప్రైమరీ నుంచి హాయ్ స్కూల్ కి వెళ్ళాడు...మనోడికి మళ్ళీ చేయి దురదేసింది..కాని ఏం లాభం తాతకి దొరికిపోయాడు ...మరి తాత  గారేమన్నాడు...ఒరే తాతా..అప్పుడే ఏం తొందరా ఇంకా సెవంతు పాసవ్వాలీ టెంతు గట్టేక్కాక  ,    ఇవ్వనీ అయ్యేక కదా కొంతేదో సాధించినట్టు... అప్పుడెత్తుకో ఎవరేమన్రు అనీ...పాపం కాస్త బెజారేక్కినా మళ్ళీ మనసు చిక్క బెట్టుకునీ సర్లే ఇంకెంత మరో పుంజీ(అంటే ఐదు అన్నమాట)...అనుకునీ  మళ్ళీ ప్రయత్నాన్ని ఆపుకున్నాడు.సెవన్త్ య్యింది  పది కూడా పన్లో పని పాసయి పోయేడు .....ఒక సారి మళ్ళీ ధ్యానం కాలరు మీదకి పోయింది  .. ఈ సారి ఎలాగైనా కాలరెత్తి తీరాలనుకున్నాడు...గబ గబా ఆ పన్లో ఉండగానే...వెనకనుంచి నాన్నోచ్చెడు ..ఒక పేద్ద ప్రవేటు  చెప్పీ ...అదే మరీ క్లాసు పీకి...ఒరే నువ్వు పాసైన అత్తెసరు మార్కులకి ఏ  కాలేజీ వాడు సీటివ్వడు...మరి ఎంట్రన్స్ పరిక్షలేవో తగలెడితే మరి ముందు ఏం పీకాలో తెలుస్తుంది ఎక్కడో జాయిన్ అయింతర్వాత  ..అప్పుడు.... అప్పుడు కాలరెత్తు చూద్దాం అన్నాడు.మరి మనాడికి విపరీతమైన నీరసం వచ్చేసీ మరి ఆ పన్లో పడ్డాడు.మొత్తానికి కిందా మీద పడి ఒక  ఇన్స్టిట్యుట్  లో చేరి ఒక డిగ్రీ వెలగబెట్టాడు.తర్వాత ఎప్పుడో ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు జ్ఞ్యాపకం  వచ్చింది .ట్రై చేసేంతలో పక్కనున్న ఫ్రెండన్నాడు..వొరే రఘూ ఇంకా టైమున్దిరా అబ్బాయి దానికి....ఇంట్లో రిటైర్ అయిన నాన్న, పెళ్ళీ డోచ్చిన  చెల్లెలు ,మంచాన పడ్డ  తల్లీ ఉన్నారూ మరీ  వీళ్ళందర్నీ నెట్టుకు రావాలంటే ఒక ఉద్యోగం  రావాలి /కావాలి...మరి అప్పుడు ఆలోచించనిన్నూ...
మన హీరో కి నిజమనిపించింది మరి ఆ ఆలోచన అప్పటికి మానుకొని ఒక ఉజ్జోగం సజ్జోగం వచ్చిన తర్వాత చూద్దామని...అలా పక్కకి పెట్టాడు.ఇంకా అల్లా అలా..ఉజ్జోగం వచ్చిన తర్వాత  వాళ్ళమ్మ ఆఖరుక్షనాల్లో ఉన్నదని పెళ్ళీ,  మరీ ఆటో మెటేగ్గా పిల్లలూ  ఆ మీద భాద్యతలూ ,ఆ పైన  రోతలూ , వెతలూ ....క్రమం లో రిటేర్మేంటూ...అన్నీ అయి పోయీ రాఘవ కాస్త రాఘవయ్య  అయిపోయేడు..
తీరిగ్గా...ఒకానొక రోజు విశ్రాంతి గా ఆలోచిస్తూ ఉంటే ఆ కాలరు గుర్తు కొచ్చింది. సరే ఇంక అన్నీ భాద్యతలూ అయిపోయాయి అనీ ఒక్కసారి   కాలరు కోసం తడుము కున్నాడు...కాకపొతే కొడుకు కుట్టించి ఇచ్చిన లాల్చీ కి మరి కాలర్ లేదు ....కాలరున్న షర్టులు వేసుకోవడం మానేసి అప్పటికి చాల ఏళ్ళయింది మరి..

నా మాట :
అందుకే  ఉన్నప్పుడే (కాలరు) కాలరెత్తాలి...దానికోసం ముహూర్తం , మంచి రోజు ,సమయం సందర్భం  ఉండవు.అర్థమయ్యిందనుకుంటాను.

1 comment: