Thursday, November 26, 2009

ముంబై నరమేధానికి ఒక సంవత్సరం ....

 తెలీకుండానే ఒక సంవత్సరం గడచి పోయింది...మీడియాకి రాజకీయ నాయకులకి చాన్నాళ్ళుగా నానిన ఒక అంశానికి ఒక సంవత్సరం ఈడు వచ్చింది...ఆ ఘటన లో పోయిన వాళ్లకి ఏమీ ఒరిగినది లేదుగానీ పట్టుబడ్డ తీవ్రవాది కసాబ్ పైన మాత్రం ఇప్పటిదాకా 31 కోట్ల ఖర్చు మాత్రం ఇప్పటిదాకా అయ్యిందట..!దగ్గర దగ్గర ఎనిమిదన్నర లక్షలన్న మాట రోజుకి ...! హవ్వ  అని నోటి మీద చేయ్యేసుకున్నారా !
హు ! అంటే రోజుకి దాదాపుగా ఒక పదివేలమందికి మాంచి భోయనం పెట్టొచ్చు...! ముంబై శివార్లలో కనీసం ౩౦౦ మందికి ఇల్లు ఏర్పాటు చెయ్యొచ్చు .. చనిపోయిన వాళ్లకి ప్రకటించిన ౩ లక్షలకి బదులుగా ఒక్కొక్కరికి కనీసం 19 లక్షలు గా పంచొచ్చు ...చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోడానికి కనీసం ఒక 600 మందికి పెట్టుబడిగా ఇవ్వచ్చు...! ఎనిమిది టన్నుల  కందిపప్పు (కేజీ ఎనభై ఐదు చొప్పున)ప్రజలకి ఫ్రీ గా పంచొచ్చు..!అహ్  ఒక వేళ ఆ కసాబ్ గాడిని అక్కడికక్కడే వేసేసి ఉంటే..!
కానీ వాణ్ని పట్టుకొని ఒక కోటి రూపాయలతో ఒక అండా సెల్ స్పెషల్ గా కట్టించి ... మేపుతూ వెనక వాదించడానికి ఒక లాయర్నిచ్చి ..అయ్యా బాబో నేనల్సిపోయా..ఆ కేసేప్పుడు ఒక కొలిక్కి వస్తుందో?  వాడికి ఏ శిక్ష పడుతుందో తెలీదు కాని వాడి పైన ఖర్చు మాత్రం కోట్లు దాటుతోంది...ఈ రేసేషణ్ కాలం లో కూడా ఈ ఖర్చులేంటో...ఈ ప్రభుత్వాలకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో!
ఈ రోజు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెట్టేసి   కొవ్వొత్తులు వెలిగించేసీ  "జరా యాద్ కరో కుర్బానీ" అంటే సరిపోతున్దనుకుంటున్నారు మన నాయకులు, అంత చూపెట్టక్కరలేదు కాని ఆ చనిపోయిన వాళ్లకి ఇస్తామన్న కంపంసేషణ్ ,గాయ పడ్డ వాళ్లకి    ఇస్తామన్న ఖర్చులు ,పోయిన వాళ్ళ బంధువులకి ఇస్తామన్న ఉద్యోగాల కోసం కాస్త ఒక గొంతు,చేయి అంటే ఊత ఇస్తే   అదే చాలు...
అయ్యా అమ్మా ఓ సో కాల్డ్ నాయకులారా..మీరు బోర్డులు  బేనర్లు పెట్టొద్దు ... 140  డెసిబల్ మించి స్పీకర్లు  పెట్టి దేశభక్తి గీతాలు వినిపించి ,కొవ్వొత్తులు వెలిగించి కాలుష్యం పెంచక్కరలేదు.సరిహద్దుల్లోకి వెళ్లి ఒక్క రోజు కాపలా ఉండండి చాలు తెలుస్తుంది ...మన దేశం లో మన వాళ్ళని రాకుండా అడ్డుకోవడం కాదు..పైవాడేవడూ మన నెత్తి మీద మొత్తకుండా చూడండి...సభల్లో మైకులు విరుచుకోవడం కాదు మన పైన విరుచుకు పడుతున్న  సమస్యల్ని పరిష్కరించండీ...దేవుడా...! ఏమవుతోంది  ఇక్కడ... తెలీకుండానే నేనుకూడా జనాల బుర్ర తింటున్నాను....హత విధీ ....
ఇంక ఇక్కడే దీనిని ఆపేస్తున్నా ....భగమంతుడా..(తెలిసే వ్రాసాను)...నా దేశాన్ని రక్షించు !ఈ కసాబ్ లాంటి వాళ్ళ నుంచి రక్షించు..ముఖ్యంగా  ఆ కసాబ్ కన్నా ప్రమాద కారులైన  ఈ అఘోర రాజ కీయ నాయకులనుంచి రక్షించు...వాల్లెక్కడనించి వచ్చారో తెలుసంటాడు ఒకడు (రాజకీయ నాయకుడే) వాళ్ళని ఎవరు పంపారో తెలుసనీ ఒకడు అంటాడు ... ఈ నారాయణ రాణేలు,చగాన్ భుజ్బల్ లు ,రాజ్ థాకరే లు,బాల థాకరే లు...ఈ' లూ 'గాళ్ళ అందరి మాయ  నుంచి మన దేశం బయట పడుతుందో...! ఏమో
హోప్ ఫర్ ది బెస్ట్...

No comments:

Post a Comment