Monday, February 01, 2010

బ్రహ్మాన్డానికే ఆనందం...జీవేత్ 'సరదా' శతం...!

డాక్టర్ బ్రహ్మానందం ...


బ్రహ్మాన్డానికే  ఆనందం...బ్రహ్మానందం .....నిజమే నాకు ఎప్పుడూ అలాగే అనిపిస్తూంటుంది ...ఈ రోజు మన హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టిన రోజు..1956 ఫిబ్రవరి ఒకటో తేదీ ఆ పుణ్యం చేసుకొంది. దగ్గర దగ్గర పాతికేళ్ళుగా తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆగకుండా ఆపకుండా నవ్విస్తున్న ఒక గొప్ప హాస్య రత్నం...జంధ్యాల తెలుగు వాళ్ళపై వదిలి వెళ్ళిన  హాస్య బాణం...అహనా పెళ్ళంట తో మొదలైన ఈ హాస్య బాణ ప్రయోగం తెలుగు ప్రేక్షకులని ఏ ఒక్కరిని వదలకుండా గుచ్చి గుచ్చి గిలిగింతలు పెడుతూనే ఉంది....
అరగుండు తో మొదలైన ఈ ప్రస్థానం..ఖాన్ దాదా గా ఊపందుకొని అనగనగా ఒక రోజు లో డేంజరస్ మ్యూజిక్ బాక్ గ్రౌండ్ గా యు నో నెల్లూర్ పెద్దారెడ్డి ? అని హడల్ గొట్టి... అలా అలా లోలాకులు...సీమశాస్త్రి ...పండిట్...లాంటి అదరగొట్టే పాత్రలు మెప్పించి...నువ్వు నాకు  నచ్చావ్ లో అంత పేరు లేని పాత్రయిన గాని ఉన్నంత సేపు నవ్వించి  మన్మధుడు లో మిష్టర్ లవంగం గా మొత్తం సినిమాకే ఒక ప్రత్యేకత పుణికి పుచ్చుకొని ...ఈ మధ్యలో లెక్ఖ లేనన్ని చమక్కులు చూపెట్టి..అతడు లో పూరీ కి సహాయం చేద్దామని భంగపడ్డ అభాగ్యపు బాబాయ్ గా..శంకర్ దాదా ఆర్ ఎం పీ అయిపోయి జనాల నవ్వుల డాక్టరై..ఒక్క సారి పోకిరి తో ట్రెండ్ మార్చి బ్రహ్మి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి కూర్చున్నారు జనాల గుండెల్లో.తర్వాత వచ్చిన సినిమాల్లో చిత్రగుప్తుడిగా (యమదొంగ )  జషువగోట్టం(భాగ్య లక్ష్మి లాటరి)  లాంటి కొన్ని వి'చిత్ర 'విన్యాసాలతో అలరించారు.
కొన్ని సినిమాలు ఒక్క బ్రహ్మానందం వల్లనే ఆడాయి  అంటే అది పెద్ద విచిత్రం కాదు...ఆ కోవ లో వచ్చేది  ఢీ సినిమా .
ఈ మధ్య వాటిల్లో బాబీ (కృష్ణ), ప్రణవ్ (జల్సా), మెక్ డావెల్ మూర్తి (రెడీ) ,హల్వా రాజ్ (కిక్),ఆర్య 2 లో  దశావతారం లాంటివి కొన్ని మైలు రాళ్లు.
అవార్డులు : నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ;అల్లు రామలింగయ్య అవార్డు ;నంది అవార్డు ; మరియు ప్రతిష్టాత్మక పద్మశ్రీ లాంటి కొన్ని కలికి తురాయిలు.గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ గుర్తింపు .
ఇలాంటి ఇంకా రివార్డులు గౌరవాలు గుర్తింపులు రావాలని ఆశిస్తూ...ప్రేక్షక సత్కారాలు పొందుతూ ...ఇంకా ఎన్నో ఆనంద భరిత చిత్రాలను మనకు అందిస్తూన్న  జీవేత్ 'సరదా' శతం !   అని ఆయన్ని దీవించమని ఆ భగవంతుణ్ణి వేడుకొందాం...


No comments:

Post a Comment