Thursday, February 18, 2010

పొలి'టికల్' దురద

పొలి'టికల్' దురద దురద...
ఈ దురద ఉంది చూసారూ ... చాలా రఖాల దురదలున్నై...ఇందులో చేతి దురద, నోటి దురద అనేవి చాలా ముఖ్య మైనవి .
ఈ మధ్య టీ వీ చూసారూ చూసుంటే మీకే తెలుస్తుంది ఈ దురదలూ వాటి తర్వాతి పరిణామాల గురించి.... 
ఈ మధ్య చాలా పాపులర్ అయింది సెపరేటు రాష్ట్ర దురద ...ఆ దురద తో పాటుగా చేతి దురద నోటి దురద అనేవి ప్రక్క లక్షణాలు (సైడ్ ఎఫ్ఫెక్ట్స్)
ఇదొక అంటూ వ్యాధి ప్రత్యేకంగా ఇది రాజకీయ నాయకులలో వ్యాప్తి లో ఉంది. ఇది నోటి దురద తో మొదలై చేతి దురదలతో కంటిన్యూ అవుతూంటుంది.ఈ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక లక్షనమంటూ ఏమి ఉండదు ఏ పార్టీ లోనైనా ఉంటారు ఏ మాటలైనా మాట్టాడతారు.టీ వీ చానల్లంటే వీళ్ళకి భలే ఇష్టం అందులోను డిస్కషన్లు చెయ్యడమంటే మరీ ఇష్టం,అందులో అవాకులూ చెవాకులూ పెలడమంటే మరీ మరీ ఇష్టం.ప్రజల కష్టాలు వీళ్ళకి అస్సలు పట్టవు వాళ్ళ మాటలు అసలు వినబడవు వాళ్ళ అభిప్రాయాలకి విలువనివ్వరు .ఈ జబ్బు కి ప్రత్యేకంగా ఒక మందంటూ లేదు.ఉపశమనానికి పక్క పార్టీ వాన్నో లేక ఇంకొక ప్రదేశం వాళ్లనో తిట్టుకుంటే సరిపోతుందట.ఈ వ్యాధి కాస్త ముదిరితే చేతి దురద కూడా బాగా ఎక్కువవుతుంది..ఈ దురదలు ప్రభుత్వాస్తులను ధ్వంసం చెయ్యడానికే కాక ప్రజలను ఇబ్బంది పెడితే తప్ప కాసింత ఉపసమనం రాదు సదరు వ్యాధిగ్రస్తులకు.ఈ వ్యాధి వ్యాప్తి కి న్యూస్ పేపర్లే కాక ఎక్కువగా న్యూస్ చానల్స్ కారకులు ,మాధ్యమాలు.
ఈ వ్యాధి మీకు సోక కుండా ఉండాలంటే రాజ కీయ నాయకులనుండి సాధ్యమైనంత  దూరంగా ఉండడం.టీ వీ లలో న్యూస్ ఛానళ్ళు చూడడం తగ్గించాలి.
ఫర్ ఎగ్జామ్పిల్ ...సదరు దురద వ్యాధిగ్రస్తుల లిస్టు..కే సి ఆర్ ,చంద్రబాబు,మోహన్ బాబు,చిరంజీవి,సో కాల్డ్ విద్యార్ధి నాయకులూ ,శోభారాణి,హరీష్ రావు ,కొడాలి నాని,రోశయ్య,లగడపాటి,ఉండవల్లి,హర్ష కుమార్ ఇలా చూస్కుంటూ పొతే ఎం ఎల్ ఏ ఎంపీ లలో దాదాపు 90 % ఈ వ్యాధిగ్రస్తులు ఉంటారు.
అందుకే జనులారా...తస్మాత్ జాగ్రత్త... దూర్ రహో దురద సే...

No comments:

Post a Comment