విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడిది 88 వ జన్మ దినం ....
నటన లో ఒక సంచలనం ఆయన...రాముడైన కృష్ణుడై నా...రావణు డైన కీచకుడైన...దుర్యోధను డైనా కర్ణుడైనా ...సాంఘీకమైనా పౌరాణిక మైనా..యే విధమైన ఆహార్యమైనా...అతనికతనే సాటి...
అశేష ఆంధ్ర జనాల హృదయాలలో నిలిచినా ఒక విశిష్ట నటుడు....జనాలలో ఎన్టీ వోడుగా, ఎన్టీ ఆర్ గా, రామారావు గా...ఒక స్థానం సంపాదించుకున్న మనీషి..
నటన లోనే కాదు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నాయకుడు...1984 దాక తెలుగు వాళ్ళ రాజధానిలో లేని తెలుగు ని పరిచయం చేసిన మహానుభావుడు.
తెలుగు వాళ్ళని కూడా మద్రాసీలని చూసే జనాలకి తెలుగు వాళ్ళంటే వేరని చూపెట్టిన మొదటి ముఖ్యమంత్రి...
అక్కడక్కడ కొన్ని నెగెటివ్ కోణాలున్నా....ఎన్టీ ఆర్ మరి విలక్షణంగా గుర్తుంచుకోవలసిన ఓ మహా నటుడు నాయకుడూ...
No comments:
Post a Comment