ఈ మద్దినే మన మంతా పర్యావరనోత్సవాలు తెగ చేసేసాం.మెయిల్ పైన మెయిలు పంపి అయిన వాళ్లకి కాని వాళ్లకి తెగ హైప్ ఇచ్చి ..ఏదో చేసేస్తున్నంట్టు పోజు కొట్టి పోటోవులు తీయించుకొని కార్పోరేట్ ఆఫీస్ కి ఈ హంగామాలు చ్చూపెడ్తే ... వాళ్ళు అక్కడి తో ఊర్కో కుండా ...న్యూసు పేపర్లకి చానళ్ళకి రెండ్రోజులకి సరిపడా మేతనిచ్చి...తెగ హంగామా చేస్తూంటే నాకు నవ్వు వచ్చింది...పిచ్చి పిచ్చి నవ్వు వచ్చింది ..అదే అల్లా అల్లా కోపంగా వెర్రి కోపంగా మారి...నేనో మెయిల్ గీకేసాను ..మా కంపనీ లో సదరు హైప్ డిపార్ట్మెంట్ కి..ఏమంటే ..మనం ఊడపీకింది ఏమి లేకపోయినా తెగ అల్లరి చేస్తున్నందుకు ...ఎవరైనా ఇల్లు చక్కపెట్టుకుని తర్వాత ఊరు చక్కపెడతారు...మా ఆఫీసులోనే ఒక ప్రింటుకి పది కాపీ లు తీస్కోనే మగానుబావులున్నారు ...అక్కర్లేని చోట లైట్లు వెలిగించే అప్పలమ్మలూ ఉన్నారు...
నీళ్ళని చిల్ల్లరగా వాడే ఉన్మాదులకి కొదవే లేదు...ఇన్ని ఉన్నా..మా కంపనీ వాళ్ళు ఇచ్చే ఆఆ ఇది చూసి రాసిన మెయిలు కి జవాబెంటో తెల్సా... మా బాస్ నించి ఒక జెల్ల కాయ లాంటి మెయిలు...నీ పని ఏంటో నువ్వు చేస్కో ...మరీ అంత ఒద్దు అనీ..
నాకు బుర్ర తిరిగినట్టయింది ....బట్ కాని
నేనూర్కున్టానా....నా వంతు సేవ నేను చేస్కుంటూ నాకు తోచిన సాయం నేను చేస్తున్నా...ఎందుకంటే నేను నాకోసం చేస్తున్నా నా వాళ్ళ కోసం చేస్తున్నా నే చేసేది చుట్టూ పక్కల వాళ్లకి ఏదోలా ఉండొచ్చు కాని ఉడతా సాయంగా... నా వంతు ఇది..
మీరు కూడా ఎవరో ఏదో అనుకుంటారనీ లేదా పేరోస్తుందనీ మాత్రం చేయకండి ...మీ కోసం చెయ్యండి ముందు తరాల వాళ్ళ కోసం చెయ్యండి...
చిన్న చిన్న పనులే చెయ్యండి అది చాలు శ్రీ రామ రక్ష....మచ్చుకి...
- అవసరమైతేనే ప్రింటు తీస్కోండి లేకుంటే సాఫ్టు కాపి ఉంచండి..
- ప్రింటు కాపీ తో పనైపోతే మళ్ళీ తిప్పి వాడండి ...మీ బాస్ ఒప్పుకోడా అయితే రఫ్ పనికి వాడండి
- ట్రూ కాపీ కన్నా స్కేన్ కాపి కి ప్రాధాన్యత ఇవ్వండి..
- బజారుకి వెళ్తున్నారా ? అయితే మీ సంచి మీరు తీస్కు వెళ్ళండి ...ప్లాస్టిక్ సంచి వద్దు...మన సంచీ ఎంతో ముద్దు(కోట్ బావుంది కదూ)
- ఇంట్లో వాడే లైట్లు సి ఎఫ్ ఎల్ లేదా ఎల్ ఈ డీ వాడండి ..మొదట్లో ఖర్చు ఎక్కువైనా గాని రన్నింగ్ లో తగ్గుతుంది.
- వంట చేసేటప్పుడు కుక్కరు వాడకం ఎక్కువ ఉండేలా చూస్కోండి..అదీ అన్ని పన్లు ఒకే సారి అయ్యేలా ప్లాన్ చేసు కొండి.
- వాన నీటిని భూమిలోకి ఇంకేలా చూడండి డ్రేయినేజ్ లో కాదు...
- ఇంట్లో ప్లాస్టిక్ పేరుకు పోయి ఉందా ఎక్కడ పడితే అక్కడ పారేయకండి...మీలో సృజనాత్మకత ఉంది...దానిని వాడి ఉపయోగించండి...
ఇలా ఇలా చాలా ఉన్నాయ్ మాస్టారూ...మీరు అనుకుంటే చేయలేనిదేమీ లేదు...సో ఆలస్యం అమృతం విషం...
మీరు కూడా మీ వంతు సాయం చెయ్యండి మన తర్వాతి తరాలకు మీ చుట్టూ పక్కల వాళ్లకి ఆదర్శం కండి ...
No comments:
Post a Comment