పెజానికానికి నమసకారం...
ఇక్కడ నేనింకో పిట్టకదః ఇనిపిద్దామని అనుకుంటున్నాను...అది మీకు తెలిసిన తెలియక పోయిన అంతా మీ ఖర్మ...అనుకోని మళ్లే నా నోటంట...సారీ సారీ నా బ్లాగంట చదవండి...
మన తెలుగు వాళ్ళందరికీ ఘోప్ప అలవాటు..ఈమధ్య ఇంగ్లీసు చదువులేక్కువై అది పోయిందేమో గాని...
ఏదైనా విశేషం లేని వస్తువుకి ప్రాధాన్యం ఇస్తే అదే నండీ గాడిద గుడ్డు కంకర పీసు అనటమే ...ఆ సందర్భం...!హమ్మయ్య అర్ధవయ్యిన్దనుకుంటా..ఇక కత లోకి వద్దాం...
మనల్ని ఇంగ్లీసు వాళ్ళు ఓ లెక్ఖ లో ఏల్తున్న టయం లో ...ఒక ఊళ్ళో జాతరయ్యిందట ...జనమంతా పొలిమేరల్లోని ఉన్న ఒక రాయిని అమ్మా వారుగా పూజల్జేస్తున్న సమయం లో...ఒహ ఇంగ్లీసు దొరవారు చూసి తెగ హాచ్చేర్ర్య పోయారంట...ఆయన అక్కడున్న పెజానికాన్ని అడిగేట్ట ఏంటీ కత అని.. అక్కడ నాలాటోడొకడు చెప్పేడండీ " దొరవారూ ఆ రాయి మా దేముడ"నీ ...
మరి దొరవారు ఫక్కున నవ్వి...ఇంగ్లీసు లో అన్నాడట...God the Good and in kankar Piece? అని ...మన వాళ్ళు అడిగేరట అంటే ఏటండీ అని...దొర వారి ఉవాచ : "మీకు అసలు బుర్ర లేదూ ..బగమంతున్ని ఏమి కాని ఆ కంకర రాయి లో చూస్కొని ఇంత హంగామా చేస్తున్నరని"న్ను...అప్పట్నించీ ఏమి లేనిదాన్ని గురించి ఎక్కువ గొడవ చేస్తే మరి గాడ్ ది గుడ్ కంకర్ పీస్ అనడం పరిపాటి అలవాటి ....అయిపోయి అయిపోయి...అది పోను పోను గాడిద గుడ్‌డై పోయింది...
ఇంత చదివి ఏముందిలే గాడిద గుడ్డూ అంటే నేనేం చెయ్యలేను గాని...మరి అదీ మన గాడిద గుడ్డు కంకర పీసు కథ...
గాడిద గుడ్డు
ReplyDeleteఈ కథ నిజం కాదనుకుంటా. నేను మా పెద్దల ద్వారా విన్నదేమంటే - మన రాష్ట్రంలో బ్రిటీషువారి హయాములో క్రైస్తవమతప్రచారం మొదలైన తొలిరోజుల్లో ఒక గ్రామంలో పాటకజనాన్ని కూర్చోబెట్టి ఒక తెల్లదొర క్రీస్తుని గురించి ఉపన్యాసాలిస్తూ చివర "God is the good. Conquer peace" (దేవుడొక్కడే మంచివాడు. శాంతిని సాధించుకొనుడు) అని నినాదం ఇచ్చాడట. ఆ ఇంగ్లీషు అర్థం కాని గ్రామీణులు ఆయనేమన్నాడని తమలో తాము చర్చించుకున్నారట. "ఏందో గాడిదగుడ్డంట, కంకరపీసంట. మనకెందుకులే" అని ఎవరిదారిన వారు పోయారట.
ReplyDeleteఅయినా అయ్యుండొచ్చు ఓబుల్‌రెడ్డి గారు... ఎందుకంటే మన దేశం లో ఒక్కొక్క ఇసేసానికి ఎనక కనీసం పది పిట్ట కతలేనా ఉంటాయి...సో ...ఆల్ ద టైం ...గాడ్ ది గుడ్ ఎవెర్ గ్రీన్....!
ReplyDelete"గాడిద గుడ్డు ...కంకర పీసు"..hahaha..both the stories are interesting...
ReplyDeleteఓ సారి ఈ కథ చదవండి: http://oldstandby.tumblr.com/post/22421966046/the-donkeys-egg
ReplyDelete