Wednesday, September 08, 2010

పర్యావరణ గణపతి...

సర్వ పెజానికానికి నమస్కారం..
ఇప్పుడు సేప్పోచేదేటంటే...మనం గణపతి పూజ చేస్తున్నాం చాలా ఘనంగా చేస్తున్నాం...కాని ఆ ఘనం గా చేస్తున్నా ఉత్సవాల వెనక మనమెంత చెరుపు చేస్తున్నామో ఎవరూ పట్టించు కోవటం లేదు...!

మన పెద్దలు చెప్పిందేవిటీ మనం చేస్తున్నదేమిటి?..అయ్యా  శాస్త్రాల్లో చెప్పినట్టు చవితి నాడు తమ శక్తి కొద్దీ మట్టి తో గాని బంగారం తో గాని విగ్రహం పెట్టి మావిడి తోరణాలతో అలంకరించి మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అలరింప చేయమన్నారు.కాని దానికి అడ్డ దిడ్డంగా విరుద్దంగా...మనం ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు పెడుతున్నాం.ప్లాస్టిక్ పువ్వులు, థెర్మాకోల్ తో చేసిన తోరణాలు వాడుతున్నాం.పెద్ద పెద్ద మైకులు స్టీరియో  సెట్లతో జనాలని అదర గోడుతున్నాం.


ఏమిటి ఇందులో లొసుగు :
పీ ఓ పీ అన్నది జిప్సం నుండి తయారుతుంది.ఇందులో ఫాస్ఫరస్ లాంటి రసాయనాలు ఉంటాయి.విగ్రహాలను నీటిలో అనిపి నపుడు ..ఈ రసాయనాలు నీటిలో కరగాటానికి ఎలాగు సమయం పడ్తుంది అదే గాకుండా కరగిన తర్వాత తమ తమ ప్రతాపాన్ని
నీటి పైన జల ప్రాణుల పైన ..వాటి పై ఆధార పడ్డా మన పైన పడ్తుంది.
ప్లాస్టిక్ : అందరికీ తెల్సిన నగ్న సత్యం ప్లాస్టిక్ ఎంత మహామారో..అది మన ప్రకృతి లో నాశనమవడానికి వందల ఏళ్ళు పడ్తుంది.
థెర్మాకోల్: ఇది ప్లాస్టిక్ కి బాబు ...ఇంకా వేరే చెప్పాల్సిన విషయం అవసరం లేదు.
మైకులు,స్టీరియోలు:ఇక వీటి సంగటి చెప్పక్కర లేదు ...పోటాను పోటీగా ఒక మండపం వాళ్ళు వేరే వీధిలో వాళ పైన కసి కొద్దో గొప్పల కు పోయో గాని...శబ్ద కాలుష్యానికి కారకులౌతున్నారు..ఆ వినిపించే సంగీతం చెవులకు ఇంపుగా ఉంటే సరే ...కన్నీ కర్ణ ఖటోరంగా ...సాంప్రదాయ సినీ గీతాలతో తమ తమ అభిమాన తారల డిస్కో పాటలతో ఊదర గొడతారు.

విన్నపం: అయ్యా అమ్మా..మీరు చెయ్యాలనుకుంటే మానవాళి కి ప్రమాదం  లేని విధంగా జరుపుకోండి..అంతేగాని మన వర్తమానానికి భవిష్యత్తుకి ముప్పు వచ్చేలా పూజలు చెయ్యకండి.
మనం పూజలు చేసేది మనం సుఖంగా ఉండడానికని దేవుడిని వేడుకోనడానికి..అంతే గాని.. కోరి కష్టాలు తెచ్చుకోవడానికి కాదు.


మీరేమి చేయ గలరు:
మట్టి బొమ్మలు దొరకుతాయి వాటిని తెచ్చుకుని పూజించండి.ఈ మధ్య పర్యావరణ గణపతులను కూడా అమ్ముతున్నారు అవి కూడా మంచిదే.
ప్లాస్టిక్ థెర్మాకోల్ బదులుగా,పచ్చని తోరణాలు సుగంధాలు విరజిమ్మే తాజా పువ్వులు (సహజమైనవి) వాడండి.
శబ్ద కాలుష్యాన్ని  దృష్టిలో ఉంచుకోండి.చుట్టూ ప్రక్కల  ఉండేవాళ్ళ మనోభావాల్ని అర్థం చేస్కుని ప్రవర్తించండి. లౌడ్ స్పీకర్ లో పాటలే కాదు..ప్రార్థనలు ,మంగళ వాయిద్యాలు చెవులకు ఇంపైన సంగీతం కూడా వినిపించ  వచ్చు.
విగ్రహాన్ని తొమ్మిది రోజులే ఉండాలని రూల్ లేదు.మీ ఓపిక బట్టి తక్కువ  రోజులైనా చెయ్యొచ్చు.వీదికొకటి పేటకొకటి విగ్రహం పెట్టాలని లేదు..! ఊరుకోక్కటి పెట్టి సార్వజనిక పూజ చేసినా మన గణనాయకుడు సంతోషిస్తాడు.


తురుఫు ముక్క :
మీకు తెలుసు మీరేమి చేస్తున్నారో ! మీరు మీ పిల్లల కు నేర్పగలరు ..మంచేదో చెడు ఏదో..
కనీసం ఈ సంవత్సం నుంచైనా సరే మన గణపతి ఉత్సవం  ,పర్యావరణ గణపతి ఉత్సవం గా మారుతుందని ,గణపయ్య ఆనందమయంగా  వచ్చి  ఆహ్లాదకరంగా నిష్క్రమించడానికి మనమందరం కృషి చేయాలని ఆశిస్తూ...

3 comments:

  1. బాగా చెప్పారు. రౌడీ సంఘాలతో వాదించి మండపాలని మార్చలేముగానీ, కనీసం ఇంట్లో పాటిస్తే కొంత మెరుగు.

    ReplyDelete
  2. చాలా బాగుంది మీ టపా..అసలెంత పెద్దవిగ్రహం చేసి ఎంత అట్టహాసంగాచేస్తే అంత గొప్పతనమని అనుకుంటారందరూ...! మీ ఈటపా వలన కొంతమందికైనా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం...!

    ReplyDelete