Friday, January 14, 2011

సంక్రాంతి శుభా కాంక్షలు

సంక్రాంతి మళ్ళీ వచ్చింది...
భోగి మంటల వెచ్చదనం తెలీటం లేదుగాని ..అర్ధం లేని ఉద్యమాల వేడి మాత్రం చురుక్కు మంటూ తగుల్తుంది ...గాలి పటాల సంగతేమో గాని ధరలో ధరలు ఆకాసాన్నంటు తున్నాయి...పెద్ద పండుగనాడు పెద్ద పెద్ద ఆశలతో చూసిన రైతు కి  పంట గుండె  మంటల్నే మిగిల్చింది ...కనుమ  నాడు ఉల్లిగార్లు చేద్దామనుకున్న  ఇల్లాలికి  ఉల్లి కోయకుండానే కళ్ళలో నీరు తెప్పిస్తోంది... 
ఏది ఏమైనా గాక...మనం ఆశా వాదులం  కాబట్టి...ఈ సంక్రాంతి క్రాంతులు తెచ్చి మీ/మన జీవితాలలో కాంతులను వెదజల్లాలని ఆశిస్తూ...అందరికి సంక్రాంతి శుభా కాంక్షలు ...

No comments:

Post a Comment