Friday, September 23, 2011

ఎనభై ఏడు వసంతాల అక్కినేని..

ఇది చాలా చాల అరుదైన విషయం ఏమో బహుశా ఈ ప్రపంచ చరిత్రలో!
ఒక నటుడు అరవై తొమ్మిది ఏళ్లుగా నటన లో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు...1941 లో మొదలైన ఆయన ప్రయాణం (చలన చిత్రాలు మాత్రమె నాటకాలైతే ఇంకా ముందే! ) ధర్మ పత్ని  తో  మొదలై  సీతారామ జననం తో పుంజుకుని తెనాలి రామకృష్ణ ,మాయ బజార్,మూగ మనసులు లాటి మైలు రాళ్ళను దాటుకుని ప్రేమనగరు మొదలు ప్రేమాభిషేకం లాంటి చిత్ర రాజాలతో  ప్రేక్షక నీరాజనం అందుకున్న  మహా నటుడి ప్రస్తానం ఇప్పటి దాక 250 కి పైగా చిత్రాలలో నటించారు.
అక్కినేనికి ఇది  88 వ జన్మ దినం   అంటే  నాకు ఇప్పటికి  ఆశ్చర్యమే ! ఆయన లవర్ బాయ్ గా చేసినపుడే అతనికి 60 అంటే  (నా చిన్నప్పుడు లెండి) నమ్మడానికి నాకు చాల రోజులు పట్టింది.. ఆ  హుషారు  చూసి ..
ఆ 88 ఏళ్ల నవ యవ్వనుడికి ..ఇదే  నా శుభేస్చ ! 
జీవేత్  శరదః శతం...!

No comments:

Post a Comment