Sunday, March 04, 2012

"ఒక లీటరు కాంతి "

శీర్షిక అదోలా ఉంది కదూ...ఇక్కడ చదవండి  తెలుస్తుంది.

ప్లాస్టిక్ బాటిల్ తో అద్భుతాలు ..ఒకటి కాదు రెండు కాదు  చూస్తూ ఉంటే రోజు రోజు కి పెరుగుతున్నాయి.
నిన్ననే నేను హిందూస్తాన్ టైమ్స్ లో ఆర్టికల్ చదివాను స్లమ్స్  లో లైటింగ్ తెచ్చిన ముంబై  ఐ ఐ టీ విద్యార్థులు గురించి.
ఆరా తీస్తే వాళ్ళు ఫిలిప్పీన్స్ లో కిందటి సంవత్సరం నుంచి మొదలైన ఒక  రకమైన విప్లవం నుంచి ప్రేరణ.
ఆ విప్లవం పేరు "ఒక లీటరు కాంతి "

MIT - మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యుట్  విద్యార్ధులు కనిపెట్టిన ఈ పద్ధతి శ్రీ ఇల్లాక్ డియజ్ అనే పారిశ్రామిక వేత్త సహకారం తో మనీల లోని మురికివాడలను వెలిగించడానికి ఉపయోగపడింది.
మురికి వాడలలో దాదాపు పైకప్పులన్నీ ఇనుప రేకులవి ఉంటాయి.అందువల్ల కావలిసిన చోట రంధ్రం చేసుకొని ఈ విప్లవాత్మక దీపాలను పెట్టుకోవటమే.!


ఎలా పని చేస్తుంది?

ఇది చాలా సరళమైన భౌతిక శాస్త్ర  పద్దతులపై ఆధార పడింది.పనికి రాని నీటి సీసాలు (ప్లాస్టిక్) నీరు నిలబడే పారదర్సక పాత్ర అయితే,అందులో ఉండే నీరు సూర్య రస్మిని వివర్తనం చెందిస్తుంది.
కప్పు పైన సగం మిగత  లోపల సగం ఉండటం వలన పై సగం సూర్య రస్మిని తీసుకుంటే మిగతా సగం వెలుగు పంచుతుంది.
ఎలా చెయ్యాలి : ఆ విషయాలు నేను నా "హరిత భావాలు"(గ్రీన్ ఐడియాస్)  అనే బ్లాగు లో పొందుపరచాను.
లేదా "ఒక లీటరు కాంతి " లో కూడా మీకు విషయ వివరణ లభిస్తుంది.


ఈ తాంత్రిక సాంకేతిక విషయాలన్నీ "ఒక లీటరు కాంతి " , మరియు హిందూస్తాన్ టైమ్స్ నుంచి తీసుకున్నవి.
వారికి నా మనః పూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు.

తుత్రుఫు ముక్క
:వర్షా కాలం లో ఇది కావలసినంత  పనిచెయ్యక పోవచ్చు. కాని మిగిలిన కాలాలో పన్చేసి  చేసే ఆదా ఇంతా అంతా కాదు.
ఇంకో విషయం,ఇది రేకు పైకప్పులకి మాత్రమె పని చేస్తుంది. :) స్లాబు ఉన్న ఇళ్ళకి దీన్ని ప్రయత్నిచకండోయ్ పైన ఉన్న వాడు మాడు పగల గోడతాడు :).



ఈ చిత్రాలను చిత్తగించండి


No comments:

Post a Comment