Sunday, May 06, 2012

నవ్వుల దినం జరుపు కోవడం అవసరమా?

నేను అడిగే ప్రశ్న కాస్త మీకు విచిత్రంగా వెటకారంగా ఉండొచ్చు..నా ఉద్దేశ్యం కాస్త వేరు.
.ఏం రోజూ నవ్వుకోలేమా ? సంవత్సరానికి ఒక సారే ఎందుకు జరుపుకోవాలి?
నవ్వు అనేది సహజంగా వస్తే అది కాస్త సోంపు గా ఉంటుంది! అంతే గాని తెచ్చిపెట్టుకొని ఎంత అట్టహాసంగా గాని వికటాట్ట హాసం చేసినా అది లాభం లేదు.
జంధ్యాల చెప్పినట్టు 
నవ్వడం  ఒక  భోగం 
నవ్వించడం   ఒక   యోగం 
నవ్వలేకపోవడం  ఒక  రోగం

ఆఫ్ కోర్స్ !మీరు రోజంతా మీరు బీజీ! కాదనను, కాని చిన్న చిరునవ్వు నవ్వడానికి కొన్ని సెకండ్లు  కావాలి! అలాంటి సెకండ్లు రోజూలో చాలా ఉన్నాయ్ !కనీసం కొన్ని గంటలలో ఒకటి రెండు సెకండ్లు చిన్న చిరునవ్వుల కి కేటాయించండి చాలు..సంవత్సరానికి ఒకసారి తెచ్చి పెట్టుకొని నవ్వే నవ్వు కన్నా ఈ వేల చిరునవ్వులు మీకు చాలా సహాయాన్ని చేస్తాయి ...మీరు సహజంగా నవ్వగలరు దానికి మీకు కామెడీ సీన్లే చూడక్కరలేదు! జోక్స్ చదవాలనే లేదు!!మీ పొరుగు వాళ్ళని చూసి మీరు చిరునవ్వు  నవ్వండి ఆ నవ్వు పెదవినుంచి కాకుండా హృదయం లోంచి తెండి..కాస్త కష్టమే కాని సులభమే!!!!!
ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో నవ్వండి ..నవ్వుకోడానికి చాలా ఘటనలు ఉంటాయి ఒక రోజులో!!!మాట్లాడండి చర్చించండి మనసు తేలిక పడే లాగ !!అల్లాగే నవ్వండి సహజంగా..రోజూ ...ప్రతీ గంట ప్రతీ క్షణం ..ఆహ్లాద కర క్షణాలు గుర్తు తెచ్చుకొని నవ్వండి..మీ పిల్లలను గుర్తు తెచ్చుకొని నవ్వండి వాళ్ళ చర్యలు గుర్తు తెచ్చుకొని నవ్వండి..మీ తలి తండ్రులు బంధువులు ..తలచుకొని నవ్వండి హాయిగా ప్రశాంతంగా...కాని ఒక్కటి గుర్తుంచు కొండి...ఈ లాఫ్టర్ డే సంవత్సరానికి ఒక సారి కాదు ..ప్రతీ రోజూ ..ప్రతీ క్షణం..మొత్తంగా మీ జీవితాంతం...జరుపుకోండి
నవ్వు నాల్గు విధాల స్వీటు...

10 comments:

  1. well said,
    like this we are celebrating mother day, fathers day etc., etc.,
    being an indian and in indian culture we praise mother, father daily.
    in my opinion there is no need to celebrate these mothers day, fathers day etc.,

    ReplyDelete
  2. బాగుందండీ మీ పోస్టు..:-)

    ReplyDelete
  3. నవ్వులకి కి కూడా దినం పెట్టారని నవ్వుకోకుండా ఉండలేకపోయాను.

    ReplyDelete
  4. నిజంగానే ..వట్టి నవ్వులకే కాదు వీలుంటే అన్నిటికి దినం పెట్టేస్తారు....

    ReplyDelete
  5. బాగా చెప్పారండీ! నవ్వులకే కాదు ఈ మధ్య జనాలు బంధుత్వాలని కూడా మర్చిపోకుండా తలొక దినం పెట్టారు కదండీ! నిత్యం పాటించేవాటికి కూడా ఇటువంటి ప్రత్యేక దినాలెందుకో?

    ReplyDelete
    Replies
    1. హ హ హ !! నిజమే రసజ్ఞ గారు!! నెనర్లు!!

      Delete