మొదట చూడ వలసింది చూడ దగింది ఇక్కడి విక్టోరియా టెర్మినస్ భవనం (ఇప్పుడది శివాజీ టెర్మినస్ ).మహా కట్టడం లోని చెక్కడపు పని రమణీయత చూడ తగ్గది .
బ్రిటిష్ ఇండో ఆర్కిటెక్చర్ కలయికతో రూపొందిన కట్టడమిది.1880 ప్రాంతం లో నిర్మించబడింది .
గేటు వే అఫ్ ఇండియా:ఈ కట్టడం 5 oవ జార్జ్, క్వీన్ మేరీ లు ౧౯౧౧ సం.లో వచ్చిన సందర్భం పురస్కరించుకొని కట్టినది.దగ్గరలోనే తాజ్ మహల్ హోటల్ ఉంది .
వి టి, గేట్ వె మధ్యలో చూడ దగ్గవి ఫ్లోరా ఫౌంటెన్ , జేహన్గీర్ గేలరీ,స్టాక్ ఎక్సేంజ్ భవనం, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యుసియం ఉన్నాయ్.గెట్ వే దగ్గరలోనే కొలాబా కాస్ వే ఉంది,మీకు కావాల్సిన షాపింగ్ చేయ వచ్చు.
చర్చ్ గేటు :ఇది ఒక రైల్వే స్టేషన్ ,దగ్గర లోనే ఉన్నా ఫాషన్ స్ట్రీట్ లో రకరకాల కొత్త ఫాషన్ బట్టలు కొనుక్కో వచ్చు.
ఇది వి టి నుంచి ఒక రెండు కి మీ దూరం ఉంటుంది.నడిచి లేదా టేక్సి లో వెళ్ళవచ్చు.ఇక్కడకి దగ్గరలోనే మరిన్ డ్రైవ్ ,నారిమన్ పాయింట్ ఉన్నాయ్.
క్రఫోర్డు మార్కెట్టు, చోర్ బజార్ , భేండీ బజార్ :ఇవి కూడా వి టి కి దగ్గర లోనే ఉన్నాయ్ .బట్టలు అన్నిరకాల ఫాన్సీ ఐటమ్స్ ఇక్కడ కూడా దొరకుతాయి.
సిద్ధి వినాయక గుడి : ఇది ప్రభాదేవి అనే ఏరియా లో ఉంది.దాదర్ స్టేషన్ నుంచి నడిచి లేదా టాక్సీ లో వెళ్ళ వచ్చు.
మహా లక్ష్మి గుడి :ఇది హాజీ అలీ దర్గా ప్రాంతానికి చాల దగ్గరలో ఉంది.చేరటానికి మహాలక్ష్మి స్టేషన్ నుంచి టాక్సీ లో వెళ్ళచ్చు. హాజీ అలీ దర్గా కూడా చూడడానికి మనోహరంగా ఉంటుంది .ఈ దర్గా సముద్రం మద్యలో కట్టబడింది ఈ 14 వ శతాబ్దపు కట్టడం .
ఇస్కాన్ మందిరం :ఈ మందిరం జుహు లో ఉన్నది- దగ్గర స్టేషన్ అంధేరీ. అక్కడ నుంచి టాక్సీ లో వెళ్ళ వచ్చు .
సముద్ర తట విహార ప్రాంతాలు : గిడ్ గావ్ చౌపాటీ -దగ్గరలో స్టేషన్ మరిన్ డ్రైవ్ ,జుహు చౌ పాటీ -దగ్గర్లో స్టేషన్ సాంటాక్రజ్ /విలే పార్లే .బ్యాండ్ స్టాండ్ - దగ్గర్లో స్టేషన్ ఖార్ /బాంద్రా.ఇక్కడ షారుక్ ఖాన్ ,ఇతర తారల బంగ్లాలు చూడచ్చు.కానీ నీళ్ళ లోకి వెళ్ళడం అన్ని చోట్ల కూడా ప్రమాదకరం. రాళ్ళ ప్రమాదమే కాకుండా నీరు కూడా చాలా కలుషితమైనది.
బోరివలి జాతీయ ఉద్యాన వనం :ముంబై కి ఉన్న ఆస్తులలో ఒక పెద్ద ఆస్తి ఈ నేషనల్ పార్క్ రకరకాల వన్య ప్రాణులను ఇక్కడ చూడవచ్చు.అనువైన వాతావరణం- జూన్ మొదలు ఫిబ్రవరి .దగ్గరలో స్టేషన్ :బోరివలి
ఇతర ప్రాంతాలు: ఎలిఫంట గుహలు - గేటు వె నుంచి లాంచిలో ఒక గంట ప్రయాణం ,పిదప ఒక 15 ని. నడక లేదా డోలీ ప్రయాణం తర్వాత ఈ గుహలు వస్తాయి (చిన్న సలహా : ఏదో చూసేద్దామని వెళ్ళొద్దు ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక 20 అడుగుల ఎత్తున్న త్రిమూర్తి తల,ఇంకొక నాలుగైదు శిల్పాలు ఉంటాయి అంతే.
కన్హేరీ గుహలు :ఈ గుహాలు బోరివలి నేషనల్ పార్క్ లోనే ఉన్నాయ్.
నవి ముంబై :కొత్తగా థానే జిల్లా లో కొంత ప్రాంతం ,రాయఘడ జిల్లలో కొద్ది ప్రాంతం తీసుకొని సిడ్కో అభివృద్ది చేసింది.
వాశి ,బేలాపూర్ సి బి డి ,నేరుళ్ ఇక్కడి కొన్ని ముఖ్య ప్రాంతాలు. అన్ని రైల్వే స్టేషన్లూ చాల భిన్నంగా తయారు చేయబడ్డాయి.
ఇక్కడ చిత్రం లో ఉన్నది వాశి స్టేషన్ ,దీనిలో టెక్నో పార్క్ కూడా ఉంది. నేరుళ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి ,SIES కేంపస్ హనుమాన్ మందిరం(౩౩ అడుగుల విగ్రహం) ప్రముఖమైనవి.
(ఇంకా ఉంది )

కన్హేరీ గుహలు :ఈ గుహాలు బోరివలి నేషనల్ పార్క్ లోనే ఉన్నాయ్.
నవి ముంబై :కొత్తగా థానే జిల్లా లో కొంత ప్రాంతం ,రాయఘడ జిల్లలో కొద్ది ప్రాంతం తీసుకొని సిడ్కో అభివృద్ది చేసింది.
వాశి ,బేలాపూర్ సి బి డి ,నేరుళ్ ఇక్కడి కొన్ని ముఖ్య ప్రాంతాలు. అన్ని రైల్వే స్టేషన్లూ చాల భిన్నంగా తయారు చేయబడ్డాయి.

(ఇంకా ఉంది )
No comments:
Post a Comment