లేటైతేనేం పదోతరగతి ఫలితాలు వచ్చాయి.ఉత్తీర్ణత శాతం చూస్తె దగ్గర దగ్గర 79% .
ప్రధమ తరగతి ఉత్తీర్ణత చూస్తె సగానికి ఎక్కువ....!
ఇదంతా బాగానే ఉంది ..కాని ఈ చదువుల నాణ్యతా పరంగా చూస్తె చదివే విధ్యార్థులు (అందరూ కాదు ).నిజంగా ఆయా విషయాల పై శ్రద్ధ పెట్టి చదువుతున్నారా లేక వట్టి మార్కులు సాధనకే చదువుతున్నారా సందేహంగా ఉంది.
ఈమధ్య నేను గ్రహించింది ఏమంటే చాలామంది పిల్లలకు వాలేమి చదువుతున్నారో దానితో ఏమి పని లేదు.మార్కులు వచ్చాయా లేదా అనే ధ్యాస తప్ప....
అంటే గన్నెప్పుడు తీసామని కాదు... బుల్లెట్టు దిగిందా లేదా అన్న లెక్క లో ఉన్నారు...
వాళ్ల కాన్సెంట్రేట్ మొత్తమంతా మార్కుల పైనే ...దాంతో వాళ్లు నేర్చుకునేది ఏమి లేదు...బట్టీ పట్టి మార్కులు తెచ్చుకునే వాళ్ళే తప్ప ,విషయాన్ని గ్రహించి ఉత్తీర్ణత సాధించిన వాళ్లు చాల తక్కువ.2 X 2=4 అని తెలుసు గాని అది ఎందుకన్నది ఇప్పటి పిల్లలకి అక్కర్లేదు.
తల్లి తండ్రులు కూడా పిల్లలకి ఎంత మార్కులోస్తున్నైఅనే తప్ప ఎంత బుర్రలోకి ఎక్కించు కున్నారన్నది పట్టించు కోవటం లేదు .
తల్లి తండ్రులు కూడా ఈ విషయాన్ని పునరాలోచించు కోవాలి .పిల్లల ఇష్టాయిష్టాల బట్టి విషయాల్ని ఎంచు కోవటం లోను సహాయం చెయ్యాలి.ఇప్పుడు ఉన్న విద్యా సంస్థలలో సగానికి పైగా కమర్షిఅల్ వేల్యూలకే ఎక్కువ విలువ నిస్తున్నై.
విద్యా ప్రాధాన్యత ఎంట్రెన్సు టెస్టులు ఎంటర్ అయినప్పుడే పోయింది.
అందువలన మనమంతా భాధ్యతా యుతంగా వ్యవహరించ వలసిన తరుణం ఇదే.ఓ తల్లి తండ్రుల్లారా ఇప్పుడైనా నిదుర లేవండి.మీ పిల్లలికి కావలిసిన విధంగా చదివించండి అంటే కాని పక్క వాళ్ల పిల్లలు ఇంజనీర్ అయితే మీవాడు కూడా ఇంజనీరు అవ్వక్కర లెద్దు...ఈ ప్రపంచంలో చాల విషయాలు చదవడానికి ఉన్నాయ్,మీ పిల్లలకు ఇష్టమైన విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి.
No comments:
Post a Comment