Monday, June 08, 2009

భారతీయుల పై దాడులు..

ఈ మధ్య ఆస్ట్రేలియా ఇంకా మిగిలిన దేశాలలో మన వాళ్ల మీద దాడులు జరిగాయి.మరి కావాలనో కాకతాళీయంగానొ ఈ దాడులు జరిగాయి...మన సో కాల్డు నేతలు వాట్ని ఖండించేసారు..అంత దాక బానే ఉంది.
అక్కడ అయ్యే దాడులు జాత్యహంకార దాడులైతే..మన దేశంలో చాల చోట్ల అయ్యే వాటినేమంటారు...
ముంబై నుంచే బయల్దేరదాం...మరి ఈమధ్య రాజ థాకరే చేయించిన /ఉసికొల్పిన వాటినేమంటారో ??? శివ సైనికులు ఇష్టా రాజ్యంగా తాండవమాడిన క్షణాలు మర్చిపోయారా? గుజరాత్ లోని ఊచ కోతలేమిటి వాట్నేమంటారు ????
కర్నాటక లో రాజ కుమార్ మరణించినపుడు అయిన గోడవలేమిటీ? మన రాయలసీమ లో నిత్యం జరిగే రక్త తర్పణలేమిటి?ఎక్కడో ఏదో అయితే ఇక్కడ తగల బెట్టుకొని ఒకరినొకరు హింసించుకొనే సంస్కృతి మనకు ఉంది.
ప్రాంతాల వారిగా మతాల ప్రాతిపదికన కులాల పేరు తో జాతుల పేరుతొ మన దేశం లో మనోళ్ళు ఎంత గా రెచ్చిపోతున్నారో కుమ్ములాడుకుంటున్నారొ అది జగ మెరిగిన సత్యం.
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు..మనం మన ఇల్లే చక్కబెట్టుకోలేక పోతున్నాం...మనవాళ్ళకు మనమే సర్ది చెప్పలేకున్నాం..ఇక్కడ మన పక్క వాళ్లనునుంచి మనం మనల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది బయట వాళ్ళనుంచి మన వాళ్ళను ఈ నాయకులు ఎలా రక్షిస్తారు..?
సర్వ జన సౌభ్రాతృత్వం గురించి మాట్లాడే మన నాయకులు మన దేశం లో దానికి వాళ్లు ఎంత పాటు పడుతున్నారో తెలుసుకోవాలి .ఈ గురివింద చంద వ్యాఖ్యలు మానుకోవాలి.వీటి వల్ల లాభం లేకపోగా ఇంకా విద్వేషాలు పెరిగే అవకాశం ఉంది.
ఏది ఏమైనా సరే ఇక్కడైన అక్కడైనా ప్రభుత్వాలు ఉన్నాయ్ వాటి పని అవి చేసుకు వెళ్తాయి. మధ్యలో ఈ తిత్తి గాళ్ళు కలుగ చేసుకోకుండా నోటి దురద తో అడ్డ దిడ్డంగా వాగా కుండా ఉంటే అదే పది వేలు.



4 comments:

  1. జాగ్రత్త. ఇలాంటి ప్రశ్నలడిగితే మీకు దేశద్రోహి అని బిరుదిచ్చేవాళ్లున్నారిక్కడ :-)

    ReplyDelete
  2. http://parnashaala.blogspot.com/2009/06/blog-post.html

    ReplyDelete
  3. I completely agree with you, gurivinda ki tana nalupu teledu anta ide mari...

    ReplyDelete
  4. avunu abraka dabra...kaani nijam nijame kada

    ReplyDelete