అమ్మలారా అబ్బలార....
ఈ కే సి ఆర్ కి ఏమి దొరకక ఆఖరికి కోతి కి కొబ్బరికాయ లాగ తెలంగాణా అంశం దొరికింది..ఇక చూస్కో అటూ ఇటూ సమయం వచ్చినప్పుడలా ఆడు కోవడం మొదలెట్టాడు.కాని ఆ కొబ్బరికాయే తిరిగి తిరిగి కిందటి ఎలక్షన్లలో నెత్తిన పడే సరికి కొంచం దిమ్మతిరిగి గమ్మునున్నాడు కొన్నాళ్ళు ...మరి వై ఎస్ లేని అదను దొరికిందని కాంగ్రెస్స్ వాళ్ళలో కొందరిని గిల్లాడు. అప్పటికే వైఎస్ ఉన్నన్ని నాళ్ళు కుక్కిన పేల లా ఉన్న కొందరు సీనియర్లు ఇంకా మంత్రులు (మాజీ / ఉన్న ) ఒకే సారి రెచ్చి పోయారు.ఇంతకూ ముందు లానే లేచిన తెలంగాణా కెరటం మళ్ళీ కిందకి పడుతుందని భావించిన రోశయ్య కొన్నాళ్ళు చూస్తూ కూచున్నాడు.అదే మరి ముదిరి బండయ్యింది.
కిందటి సార్లా రెండ్రోజులు కాగానే కే సి ఆర్ దీక్ష మానేసి బజ్జుంటాడని అనుకున్నాడేమో పాపం .కాని అప్పటికే కే సి ఆర్ స్టూడెంట్ లని గిల్లి వదిలాడు .దాంతో మానేద్దామని అనుకున్నా కుదరలేదు .ఈ లోగా మన చిదంబరం గారు కొంపలు ములుగు తున్నట్టు హడావిడి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులిపెసుకొన్నాడు. కాని అది ఒక నిప్పుని ఆపింది కాని దుమ్ముని తిరగ రేపింది. మరి మన లగడపాటి ఇంకా మిగిలిన సహా చరులు కలిసి సమైఖ్యాంధ్ర ఉద్యమం కొందరు ఉట్టి (ఓన్లీ) ఆంద్ర ఉద్యమం,ఇంకాస్త మంది సీమ ఉద్యమం మొదలెట్టారు.సివరాఖరుకి బందులూ గలాటాలతో మొత్తం రాష్ట్రమంతా గత పది పదిహేను రోజులుగా హింస నాదం లో నాట్యమాడుతున్నారు.ఒక వేళ ఈ నాయకులకి ప్రజలు పడితే ఇలాగే ఆడుకుంటారా..! ఇలాగే రెచ్చ గొడతార?
వీళ్ళకేం బానే ఉంటారు సంపాదించు కున్నంత సంపాయించుకొని , వాళ్ళ పిల్లలు చుట్టాలక్కూడా సంపాయించి పెట్టీ..ఊళ్ళన్నీ పంచి పెట్టేసి...వారసులని ప్రకటించేసి...సుబ్బరంగా ఉంటారు.ఎటొచ్చీ వెర్రి ప్రజలే మరి బందంటే బందనీ ,తగలెట్టంటే రోజూ తానేల్లె బసూ కూడా తగలేట్టేసే జనం.. మన జనం.పరీక్షలు రాయకండీ మనకు సెపరేటు రాష్ట్రం ఒస్తుందంటే లేక ఒకే రాష్ట్రం కోసం పరీక్ష రాయని జనం..ఇక్కడ ఆలోచిన్చాల్సినదేంటంటే..ఎ ఒక్క నాయకుడూ కూడా ఒక్కరోజు కాలేజి కి వెళ్ళకుండానే విద్యార్థినాయకులై (కనీస విద్యార్హత లేని వాళ్ళు కూడా ఈ నాయకులలో ఉన్నారంటే మీరు నమ్ముతారా?) విద్యార్థులను శాసిస్తున్నారు ఇదీ మన జనం.
జనం ఎందుకు ఆలోచించరు.ఎప్పుడూ ప్రజా సమస్య పట్టిచు కొని నాయకులు ఒక్క సారిగా రాష్ట్రమిస్తామానో మరి ఇంకోటో సమస్య తీసుకొని మన ముందుకు వస్తున్నప్పుడు ,మనముందే మన ఆస్తులని తగలేస్తున్నప్పుడు, ఒక్క సారి ఆలోచించండీ...
పరీక్షలు రాయోద్దన్నప్పుడు ఒక్క సారి చూస్కోండి..ఇక్కడి పరీక్షలు మళ్ళీ పెట్టొచ్చు కాని ఈ పరీక్షల ఫలితాల పై ఆధార పడి ఉండే ఐ ఐ టీ లాంటి ఎంట్రన్సుల పరిస్థితి ఏమిటీ? మన కోసం అవి మళ్ళీ మళ్ళీ పెట్టరే!కనుక విద్యార్థులు ఆలో చించుకోవాలి.పెద్దవాళ్ళు విజ్ఞ్యులు ఆలోచించాలి ;అవసరమైతే పిల్లలని వారించాలి.
ఏ ప్రాంతం వాళ్ళని కాదు ఏ వాదమనీ కాదు ...జనాలు విధ్యార్థులు కాస్త ఆలోచించండీ ....రాజకీయ నాయకుల వెనక ముందు మీరు నడవకండీ...!మీ భవిష్యత్తు పాడు చేసుకోకండీ...
No comments:
Post a Comment