నమస్కారం !నాపేరు కన్నాజీ రావు ప్రస్తుత నివాసం ముంబైనగరం,నిజ వాస్తవ్యం విశాఖ జిల్లా,అనకాపల్లి.హాస్యం లాస్యం కదంబం నాకు ఇష్టమైన విషయాలు
Friday, January 08, 2010
త్రీ ఈడియట్స్....
ఈ హిందీ సినిమా ఇప్పటిదాకా నేను చూసిన సినిమాలలో ఒక విధంగా హట్కే టైపు....
ప్రస్తుతమున్న పోటీ ప్రపంచం గురించి ముఖ్యంగా చదువుల కోసం పాట్లు పడే చిన్నారుల/ విద్యార్ధుల గురించి వాళ్ళ తల్లి తండ్రుల ఆరాటం గురించి...ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది...
మంచి కధ తో పాటు హాస్యం (కాస్త అక్కడక్కడ ఎక్కువైనా) కలిపి ఒక మాదిరి సంగీతం తో మేళవించి మన ముందుకు దర్శకుడు వదిలారు.ముఖ్యంగా నట వర్గం తమ తమ పాత్రలకి 100 % జీవమ్ పోశారు .అమీర్ ఖాన్ రాంచో అలియాస్ వాన్గడు ,మాధవన్ - ఫర్హాన్ గా ,శర్మాన్ - రస్తోగి గా ,బోమన్ ఇరాని ప్రో. వైరస్ అలియాస్ వీరు సహస్రాబుద్దే గాను మరియు కరీనా అతగాడి కూతురుగా చాలా బాగా నటించారు.
ఎన్ని కంట్రవార్సీ ఉన్నా సరే ........ఒక్కటి నిజం మన దేశం లో బహుశా ప్రపంచం లో చాలా మంది జీవితాల లో ఉన్న ఒక నగ్న సత్యాన్ని హత్తుకునే లా చెప్పారు .
ఒక విచిత్రమేమంటే కాక తాలీయమో మరేదో గాని ..ఈ సినిమా కిందటి సంవత్సరం నేను నా బ్లాగు లో రాసు కున్న నా మనోగతాన్ని బయటకు లాగింది.
ఈ సినిమా మీరు తల్లి దండ్రులలో ఒకరైతే చూడండీ ...స్టూడెంట్ స్త్రగలర్ అయితే తప్పకుండా చూడండి...స్టుపిడ్ అని నుకుంటే మరి తప్పకుండా చూడండి....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment