ఆనంద ఆనందమాయేనే...మన సత్తిగాడు సత్యనందుడాయేనే...చిట్టి గాడు చిదానందుడాయేనే....
ఈ మధ్య అలా అలా ఇటూ అటూ తిరుగుతూ ఆ చెత్తా ఈ చెత్త చూస్తూ ,అక్ఖర్లేని వన్నీ చూస్తూ ఉంటే చటుక్కున ఒక్క సారి నాకో జ్ఞానోదయం ఒకానొక అమ్మవాస్య అర్థ రాత్రి మా సైట్ లోని సగం అయిన ఫాల్సు సీలింగ్ కింద అయ్యింది.. అదేంటంటే ఇంత చదువు చదివి చేసే ఉద్యోగం కంటే మేలైన రివార్దులే తప్ప ఏ విధమైన రిస్కూ లేని ఒక సజ్జోగం తోచింది..
అది చాలా వీజీ...ఏ పెట్టుబడి అక్ఖర లేదు ..కాస్తంత పీ ఆర్ ..అంతే పబ్లిక్కు లో రిలేషన్ అని..అదీ మరేమంతా పెద్దపనేం కాదు...మీకు చేతనైతే మీరే చేసుకోవచ్చు లేదంటే మీకు తెలిసిన మీలాంటి భావాలున్న మరో పెద్ద మడిసిని చూస్కొని ,మీరు నోర్ముస్కోని కూడా కధ నడిపించా వచ్చు...
కావాల్సింది :
- కొన్ని కాషాయ వస్త్రాలు /కాకపొతే తెల్లవైనా పర్లేదు.
- ధర్మార్ధ కామ మోక్షాల పైన మిడి మిడి జ్ఞానం (పూర్తిగా అవసరం లేదు)
- పురాణాల్లో కథలు (డిపెండ్స్... ఏ మతమన్నది కాదు కధ చెప్పామా లేదా అన్నది కావాలి)
- కూర్చుని కతలు చెప్పడానికి కొంత చోటు...(ఇప్పుడు కొంత ఉంటే తర్వాత చాలా అవుతుంది )
- కూర్చొని చేసే కొన్ని మేజిక్కులు ట్రిక్కులు
- పేరులో ఆనందం ప్లస్ స్వామి
మీకు ప్రాక్టీసు కావాలంటే మన స్వామి నిత్యానంద ,కల్కి & వాళ్ళావిడ ,ఆసారామ్బాపు ఎట్సెట్ర లాంటి మగాను బావుల వీడియో లో లేక పుస్తకాలో ఏ చెత్తా దొరకిన చూడండీ,చదవండీ.కొందరు బాబాల లాగ మాజిక్కు లు జిమ్మిక్కులు కూడా మధ్యలో చేస్తూ ఉంటే భలే థ్రిల్లు.
ఇక చూస్కోండి కావలసినంత భక్త సంద్రం ...మీ వెంట పడి వేధిస్తుంది...నా కష్టాలంటే నా కష్టాలు తీర్చ మని ...ఒక కొన్నాళ్ళు కాస్త పాట్లు పడ్డా మరి తర్వాత మీకే తెలుస్తుంది ఈ పని ఎంత వీజీ యో ఎంత మంది వెర్రి మానవులు ఉన్నారో....ఆలస్యమెందుకు...మరి..మొదలెట్టండి...మీ ఆనంద ఆశ్రమం ....
*ఇది జన హితాన ప్రచురించబడినది మీరూ బాబా అవ్వండి దొంగ బాబాల పని పట్టండి...
No comments:
Post a Comment