Monday, January 24, 2011

భీమ సేన్ జోషి

హిందూ స్తాని  సంగీతమంటే భీమ సేన్ జోషి, భీమ సేన్ జోషి అంటే హిందుస్తానీ సంగీతం అనిపిస్తుంది..అతని స్వరం గాత్ర మాధుర్యం అలాంటివి..
ఎక్కడో కర్నాటక లోని గడగ్ నుంచి ధార్వాడ్వెళ్లి అటునుంచి అటే తగ్గ గురువుని వెతుక్కుంటూ..పూనే, గ్వాలియర్ ఇంకా ఉత్తర భారతమంతా వెతికి వెతికి తిరిగి ధార్వాడ్ లోనే సవాయి గంధర్వ ని గురువుగా శిష్య రికం చేసారు.అంచలంచెలుగా ఎదిగిన ఆయన హిందుస్తానీ మంచి పట్టు సాధించారు.ముఖ్యంగా ఆయన పాడిన భక్తీ సంగీతం కన్నడం లోను మరాఠీ హిందీ లలో చాలా పేరు సంపాదించాయి.ముఖ్యంగా  ఆయన పాడిన అభంగ్ లు మరువలేనివి.
ఈయన్ని భారత దేశం అంతా బాగా గుర్తించినది "మైల్ సుర్ మేర తుమ్హారా"లో. భారత ప్రభుత్వం ఈయనను భారత రత్న తో 2008 లో సత్కరించింది.
ఏది ఏమైనా ఈ గాన గంధర్వుని లోటు ఎవరూ తీర్చ లేనిది...

No comments:

Post a Comment