రావు గోపాలరావు సూర్యుడి మీద కామెంటిన...రాములోరు సీతమ్మని క్రీగంట చూసినా...రాంబంటు లో రాజేంద్ర ప్రసాదుని తై తక్కలాడించినా,ముత్యాల ముగ్గులో సంగీతని ముద్దుగుమ్మగా చూపెట్టినా ఆయనకే చెల్లు..బుడుగు చేత బెద్ద బెద్ద మట్టాడిన్చినా, బామ్మ చేత ప్రైవేటు వినిపించినా.. ఆయనే సాటి...బాపు గారి గీతకి ఆయన రాతే ప్రాణమేమో అనిపిస్తూంటుంది అప్పుడప్పుడు...!
ఆయన రాత స్టయులు శైలి...ఇంకెక్కడా ఇంకెప్పుడు చూడ లేము చదువలేము...! ఆయన సృష్టించిన పాత్రలు మరసి పోవడం అంటే అదంతా అర్రీ బుర్రీ యవ్వారం కాదు...మచ్చుకి బుడుగు,రెండుజెళ్ళ సీత ,సి గాన పెసూనాంబ ,బామ్మ,తుత్తి,రావుగోపాలరావు ముత్యాలముగ్గు లో,ఇంకా చాల ఉన్నాయ్...చెప్పాలంటే..
కిందటి సంవత్సరం స్వాతి పుస్తకం ఉట్టి ... ఆయన కోతి కొమ్మచ్చి చదవడానికే కొనే వాణ్ణి..కట్టి పడేసే కథనం రమణ గారిది...ఆయన దర్సకత్వం కూడా సహజత్వానికి మన చుట్టూ ఉన్న వాతావరణానికి బాగా దగ్గరగా ఉంటుంది..
బాపూ రమణ జంట ఒక విధంగా మన తెలుగు వాళ్లకి ఒక పెద్ద.... దేవుడిచ్చిన వరం...!ఆయన లోటు నాకే ఏదోలా ఉంటే మరి బాపు గారికి కి ఎంత లా ఉంటుందో...
ఆయన రచనలు ,బాపు కార్టూన్లు నాకు చాల చాల చెప్పలేనంత ఇష్టం..ఆ జంట పైన గౌరవం తో నా పుత్రా రత్నాన్ని బుడుగూ అని పిల్చుకుంటున్నాను ముద్దుగా..
ఎంత ఏమైనా ఎన్ని సార్లు ముత్యాల ముగ్గు చూసినా ,బుడుగు కతలు చదివినా..రమణ గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది మరి ...
రమణ గురుతులు ఒక్ఖ సారి స్మరణ చేసు కుందాం ఈ "కలాపోసన" వీడియో తో
No comments:
Post a Comment