Showing posts with label environmental support. Show all posts
Showing posts with label environmental support. Show all posts

Tuesday, September 18, 2012

పచ్చని ప్రపంచానికి...పర్యావరణ గణపతి...

Green Ideas: Eco friendly Ganapathy: Why we need Eco friendly Ganapathy Ganesh...he is the one who clear the hassles in our lives... but we are making the things critical and...

Sunday, March 04, 2012

"ఒక లీటరు కాంతి "

శీర్షిక అదోలా ఉంది కదూ...ఇక్కడ చదవండి  తెలుస్తుంది.

ప్లాస్టిక్ బాటిల్ తో అద్భుతాలు ..ఒకటి కాదు రెండు కాదు  చూస్తూ ఉంటే రోజు రోజు కి పెరుగుతున్నాయి.
నిన్ననే నేను హిందూస్తాన్ టైమ్స్ లో ఆర్టికల్ చదివాను స్లమ్స్  లో లైటింగ్ తెచ్చిన ముంబై  ఐ ఐ టీ విద్యార్థులు గురించి.
ఆరా తీస్తే వాళ్ళు ఫిలిప్పీన్స్ లో కిందటి సంవత్సరం నుంచి మొదలైన ఒక  రకమైన విప్లవం నుంచి ప్రేరణ.
ఆ విప్లవం పేరు "ఒక లీటరు కాంతి "

MIT - మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యుట్  విద్యార్ధులు కనిపెట్టిన ఈ పద్ధతి శ్రీ ఇల్లాక్ డియజ్ అనే పారిశ్రామిక వేత్త సహకారం తో మనీల లోని మురికివాడలను వెలిగించడానికి ఉపయోగపడింది.
మురికి వాడలలో దాదాపు పైకప్పులన్నీ ఇనుప రేకులవి ఉంటాయి.అందువల్ల కావలిసిన చోట రంధ్రం చేసుకొని ఈ విప్లవాత్మక దీపాలను పెట్టుకోవటమే.!


ఎలా పని చేస్తుంది?

ఇది చాలా సరళమైన భౌతిక శాస్త్ర  పద్దతులపై ఆధార పడింది.పనికి రాని నీటి సీసాలు (ప్లాస్టిక్) నీరు నిలబడే పారదర్సక పాత్ర అయితే,అందులో ఉండే నీరు సూర్య రస్మిని వివర్తనం చెందిస్తుంది.
కప్పు పైన సగం మిగత  లోపల సగం ఉండటం వలన పై సగం సూర్య రస్మిని తీసుకుంటే మిగతా సగం వెలుగు పంచుతుంది.
ఎలా చెయ్యాలి : ఆ విషయాలు నేను నా "హరిత భావాలు"(గ్రీన్ ఐడియాస్)  అనే బ్లాగు లో పొందుపరచాను.
లేదా "ఒక లీటరు కాంతి " లో కూడా మీకు విషయ వివరణ లభిస్తుంది.


ఈ తాంత్రిక సాంకేతిక విషయాలన్నీ "ఒక లీటరు కాంతి " , మరియు హిందూస్తాన్ టైమ్స్ నుంచి తీసుకున్నవి.
వారికి నా మనః పూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు.

తుత్రుఫు ముక్క
:వర్షా కాలం లో ఇది కావలసినంత  పనిచెయ్యక పోవచ్చు. కాని మిగిలిన కాలాలో పన్చేసి  చేసే ఆదా ఇంతా అంతా కాదు.
ఇంకో విషయం,ఇది రేకు పైకప్పులకి మాత్రమె పని చేస్తుంది. :) స్లాబు ఉన్న ఇళ్ళకి దీన్ని ప్రయత్నిచకండోయ్ పైన ఉన్న వాడు మాడు పగల గోడతాడు :).



ఈ చిత్రాలను చిత్తగించండి


Wednesday, September 08, 2010

పర్యావరణ గణపతి...

సర్వ పెజానికానికి నమస్కారం..
ఇప్పుడు సేప్పోచేదేటంటే...మనం గణపతి పూజ చేస్తున్నాం చాలా ఘనంగా చేస్తున్నాం...కాని ఆ ఘనం గా చేస్తున్నా ఉత్సవాల వెనక మనమెంత చెరుపు చేస్తున్నామో ఎవరూ పట్టించు కోవటం లేదు...!

మన పెద్దలు చెప్పిందేవిటీ మనం చేస్తున్నదేమిటి?..అయ్యా  శాస్త్రాల్లో చెప్పినట్టు చవితి నాడు తమ శక్తి కొద్దీ మట్టి తో గాని బంగారం తో గాని విగ్రహం పెట్టి మావిడి తోరణాలతో అలంకరించి మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అలరింప చేయమన్నారు.కాని దానికి అడ్డ దిడ్డంగా విరుద్దంగా...మనం ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు పెడుతున్నాం.ప్లాస్టిక్ పువ్వులు, థెర్మాకోల్ తో చేసిన తోరణాలు వాడుతున్నాం.పెద్ద పెద్ద మైకులు స్టీరియో  సెట్లతో జనాలని అదర గోడుతున్నాం.


ఏమిటి ఇందులో లొసుగు :
పీ ఓ పీ అన్నది జిప్సం నుండి తయారుతుంది.ఇందులో ఫాస్ఫరస్ లాంటి రసాయనాలు ఉంటాయి.విగ్రహాలను నీటిలో అనిపి నపుడు ..ఈ రసాయనాలు నీటిలో కరగాటానికి ఎలాగు సమయం పడ్తుంది అదే గాకుండా కరగిన తర్వాత తమ తమ ప్రతాపాన్ని
నీటి పైన జల ప్రాణుల పైన ..వాటి పై ఆధార పడ్డా మన పైన పడ్తుంది.
ప్లాస్టిక్ : అందరికీ తెల్సిన నగ్న సత్యం ప్లాస్టిక్ ఎంత మహామారో..అది మన ప్రకృతి లో నాశనమవడానికి వందల ఏళ్ళు పడ్తుంది.
థెర్మాకోల్: ఇది ప్లాస్టిక్ కి బాబు ...ఇంకా వేరే చెప్పాల్సిన విషయం అవసరం లేదు.
మైకులు,స్టీరియోలు:ఇక వీటి సంగటి చెప్పక్కర లేదు ...పోటాను పోటీగా ఒక మండపం వాళ్ళు వేరే వీధిలో వాళ పైన కసి కొద్దో గొప్పల కు పోయో గాని...శబ్ద కాలుష్యానికి కారకులౌతున్నారు..ఆ వినిపించే సంగీతం చెవులకు ఇంపుగా ఉంటే సరే ...కన్నీ కర్ణ ఖటోరంగా ...సాంప్రదాయ సినీ గీతాలతో తమ తమ అభిమాన తారల డిస్కో పాటలతో ఊదర గొడతారు.

విన్నపం: అయ్యా అమ్మా..మీరు చెయ్యాలనుకుంటే మానవాళి కి ప్రమాదం  లేని విధంగా జరుపుకోండి..అంతేగాని మన వర్తమానానికి భవిష్యత్తుకి ముప్పు వచ్చేలా పూజలు చెయ్యకండి.
మనం పూజలు చేసేది మనం సుఖంగా ఉండడానికని దేవుడిని వేడుకోనడానికి..అంతే గాని.. కోరి కష్టాలు తెచ్చుకోవడానికి కాదు.


మీరేమి చేయ గలరు:
మట్టి బొమ్మలు దొరకుతాయి వాటిని తెచ్చుకుని పూజించండి.ఈ మధ్య పర్యావరణ గణపతులను కూడా అమ్ముతున్నారు అవి కూడా మంచిదే.
ప్లాస్టిక్ థెర్మాకోల్ బదులుగా,పచ్చని తోరణాలు సుగంధాలు విరజిమ్మే తాజా పువ్వులు (సహజమైనవి) వాడండి.
శబ్ద కాలుష్యాన్ని  దృష్టిలో ఉంచుకోండి.చుట్టూ ప్రక్కల  ఉండేవాళ్ళ మనోభావాల్ని అర్థం చేస్కుని ప్రవర్తించండి. లౌడ్ స్పీకర్ లో పాటలే కాదు..ప్రార్థనలు ,మంగళ వాయిద్యాలు చెవులకు ఇంపైన సంగీతం కూడా వినిపించ  వచ్చు.
విగ్రహాన్ని తొమ్మిది రోజులే ఉండాలని రూల్ లేదు.మీ ఓపిక బట్టి తక్కువ  రోజులైనా చెయ్యొచ్చు.వీదికొకటి పేటకొకటి విగ్రహం పెట్టాలని లేదు..! ఊరుకోక్కటి పెట్టి సార్వజనిక పూజ చేసినా మన గణనాయకుడు సంతోషిస్తాడు.


తురుఫు ముక్క :
మీకు తెలుసు మీరేమి చేస్తున్నారో ! మీరు మీ పిల్లల కు నేర్పగలరు ..మంచేదో చెడు ఏదో..
కనీసం ఈ సంవత్సం నుంచైనా సరే మన గణపతి ఉత్సవం  ,పర్యావరణ గణపతి ఉత్సవం గా మారుతుందని ,గణపయ్య ఆనందమయంగా  వచ్చి  ఆహ్లాదకరంగా నిష్క్రమించడానికి మనమందరం కృషి చేయాలని ఆశిస్తూ...

Wednesday, June 23, 2010

పర్యావరణం ...మనమేం చేస్తున్నాం..?

అయ్యా నమస్కారం...
ఈ మద్దినే   మన మంతా పర్యావరనోత్సవాలు తెగ చేసేసాం.మెయిల్ పైన మెయిలు  పంపి  అయిన వాళ్లకి కాని వాళ్లకి తెగ హైప్ ఇచ్చి ..ఏదో చేసేస్తున్నంట్టు పోజు  కొట్టి  పోటోవులు తీయించుకొని కార్పోరేట్ ఆఫీస్ కి ఈ హంగామాలు చ్చూపెడ్తే ... వాళ్ళు అక్కడి తో ఊర్కో కుండా ...న్యూసు పేపర్లకి చానళ్ళకి రెండ్రోజులకి సరిపడా మేతనిచ్చి...తెగ హంగామా చేస్తూంటే నాకు నవ్వు వచ్చింది...పిచ్చి పిచ్చి నవ్వు వచ్చింది ..అదే అల్లా అల్లా కోపంగా వెర్రి కోపంగా మారి...నేనో మెయిల్ గీకేసాను ..మా కంపనీ లో సదరు హైప్ డిపార్ట్మెంట్ కి..ఏమంటే ..మనం ఊడపీకింది ఏమి లేకపోయినా తెగ అల్లరి చేస్తున్నందుకు ...ఎవరైనా ఇల్లు చక్కపెట్టుకుని తర్వాత ఊరు చక్కపెడతారు...మా ఆఫీసులోనే ఒక ప్రింటుకి పది కాపీ లు తీస్కోనే మగానుబావులున్నారు ...అక్కర్లేని చోట లైట్లు వెలిగించే అప్పలమ్మలూ ఉన్నారు...
నీళ్ళని చిల్ల్లరగా వాడే ఉన్మాదులకి కొదవే లేదు...ఇన్ని ఉన్నా..మా కంపనీ వాళ్ళు ఇచ్చే  ఆఆ ఇది చూసి రాసిన మెయిలు కి జవాబెంటో  తెల్సా... మా బాస్ నించి ఒక జెల్ల కాయ లాంటి మెయిలు...నీ పని ఏంటో  నువ్వు చేస్కో ...మరీ అంత ఒద్దు అనీ..
నాకు బుర్ర తిరిగినట్టయింది ....బట్ కాని
 నేనూర్కున్టానా....నా వంతు సేవ నేను చేస్కుంటూ నాకు తోచిన సాయం నేను చేస్తున్నా...ఎందుకంటే నేను నాకోసం చేస్తున్నా నా వాళ్ళ కోసం చేస్తున్నా నే చేసేది చుట్టూ పక్కల వాళ్లకి ఏదోలా ఉండొచ్చు కాని ఉడతా సాయంగా... నా వంతు ఇది..
మీరు కూడా ఎవరో ఏదో  అనుకుంటారనీ లేదా పేరోస్తుందనీ మాత్రం చేయకండి ...మీ కోసం చెయ్యండి ముందు తరాల వాళ్ళ కోసం చెయ్యండి...
చిన్న చిన్న పనులే చెయ్యండి అది చాలు శ్రీ రామ రక్ష....మచ్చుకి...

  • అవసరమైతేనే ప్రింటు తీస్కోండి లేకుంటే సాఫ్టు కాపి ఉంచండి..
  • ప్రింటు కాపీ తో పనైపోతే మళ్ళీ తిప్పి వాడండి ...మీ బాస్ ఒప్పుకోడా అయితే రఫ్ పనికి వాడండి 
  • ట్రూ కాపీ కన్నా స్కేన్ కాపి కి ప్రాధాన్యత ఇవ్వండి..
  • బజారుకి వెళ్తున్నారా ? అయితే మీ సంచి మీరు తీస్కు వెళ్ళండి  ...ప్లాస్టిక్  సంచి వద్దు...మన సంచీ  ఎంతో ముద్దు(కోట్ బావుంది కదూ)   
  • ఇంట్లో వాడే లైట్లు సి ఎఫ్ ఎల్ లేదా ఎల్ ఈ డీ వాడండి ..మొదట్లో ఖర్చు ఎక్కువైనా గాని రన్నింగ్ లో తగ్గుతుంది.
  • వంట చేసేటప్పుడు కుక్కరు వాడకం ఎక్కువ ఉండేలా చూస్కోండి..అదీ అన్ని పన్లు ఒకే సారి అయ్యేలా ప్లాన్ చేసు కొండి.
  • వాన నీటిని భూమిలోకి ఇంకేలా చూడండి డ్రేయినేజ్  లో కాదు... 
  • ఇంట్లో ప్లాస్టిక్ పేరుకు పోయి ఉందా ఎక్కడ పడితే అక్కడ పారేయకండి...మీలో సృజనాత్మకత ఉంది...దానిని వాడి ఉపయోగించండి... 
ఇలా ఇలా చాలా ఉన్నాయ్ మాస్టారూ...మీరు అనుకుంటే చేయలేనిదేమీ లేదు...సో ఆలస్యం అమృతం విషం...
మీరు  కూడా మీ వంతు సాయం చెయ్యండి మన తర్వాతి తరాలకు మీ చుట్టూ పక్కల వాళ్లకి ఆదర్శం కండి ...