Thursday, May 28, 2009

యమహా నగరీ ముంబై మహా పురీ ....

ముంబై నగరం ...దేశం లో తెలియని వారుండరేమో...
చూడక పోయినా కనీసం చెవులార విన్నవారైతే దేశం లో చాల మంది ఉంటారు
నేను దాదాపుగా ఆరు సంవత్సరాలైంది ఇక్కడకు వచ్చి .నా అను
భూతుల్ని ఇక్కడ ఈ టపా లో అందరి తో పంచుకుందామని నా చిన్న ప్రయత్నం.

భౌగోళికం : భారత దేశపశ్చిమ తీర ప్రాంతం లో ఉన్న ఒక చిన్న ద్వీపంలో భాగం దీన్నె షష్టి ద్వీపం అంటారు (ఇంగ్లీష్ లో salsette)ముంబాయి మహా నగరం ఈ ద్వీపాన్ని థానే జిల్లా తో పంచుకున్నది అంటే ఈ ద్వీపం లో మూడొంతులు ముంబాయి అయితే మిగిలింది థానే లో వస్తుంది.
ముంబాయి కి పశ్చిమాన దక్షిణాన అరేబియా సముద్రం ,తూర్పున థానే క్రీక్ ,ఉత్తరాన థానే జిల్లాలూ హద్దులుగా ఉంది.
సముద్ర మట్టానికి దాదాపు గా 15 మి ఎత్తు లో ఉంది
విస్తీర్ణం దాదాపుగా 700 చ కి మీ

అయితే వాడకం లో ముంబాయి, థానే కళ్యాణ్, నవీ ముంబాయి అన్నిటినీ కలిపి ముంబాయి అనే అనేస్తారు.అంటే ముంబాయి థానే ఇంకా రాయఘడ జిల్లలో కొంత ప్రాంతం కలిసి వాడుక లో ముంబాయి అన్నమాట.
జనం జనాభా: జనాభా ఒకటిన్నర కోట్లకి దరిదాపులుగా.
ఇక్కడ మనకి కనిపించేది మహారాష్ట్రియన్లు 50%,గుజరాతీలు 25% ,మిగిలినది తమిళులు ఆంధ్రులు,మలయాళీలు ఇంకా ఉత్తర భారతీయులు ఉంటారు.
భాషలు:
ఎక్కువ మాటలాడేది ముంబయ్యా హిందీ, తర్వాత మరాఠీ ,గుజరాతీ ఇంకా మిగిలిన తమిళ ,తెలుగు ,మలయాళం, సింధీ
వాతావరణం :
జూన్ జులై ఆగష్టు తప్పించి మిగిలిన అన్ని రోజులూ ఒకే విధమైన వాతావరణం ఉంటుంది.
జూన్ జులై ఆగష్టు నెలల్లోఖచ్చితంగా వర్షాలుంటాయి.ఒక వేళ ఎవరైనా తిరగడానికి వద్దామంటే మూడు నెలలు కాక మిగలిన రోజులలోమంచిది.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment