Monday, June 01, 2009

యమహా నగరీ ముంబై మహా పురీ .... 3 వ భాగం

ఇక్కడ తినడానికి ఏమున్నాయి ?:
వడా పావు : సాటి మరాఠీ సామాన్యుడి నుంచి రుచి మరిగిన రిచ్చు బాబులదాక ఇక్కడ ఇష్టంగా తినేది ..ఇంకా విరివిగా దొరికేది ఈ తిను బండారం.మనకి తెలిసిన ఆలూ బోండా నే ఇక్కడ వడ అంటారు.దానిని మధ్యకు చీల్చి మసాల అద్దిన పావు రొట్టె లో పెట్టి సెర్వ్ చెయ్యబడేదే ఈ వడాపావు . ౩ రూపాయల నుంచి ౩౦ రూ. రేంజ్ దాక లభ్యమవుతుంది.ఎక్కడైనా సరే ...కాస్త నీట్ గ ఉన్నా ఏ దుకాణం లోనైనా తినచ్చు.
పావ్ భాజీ : ఇది కూడా ఒక లెక్కలొ కాస్త ఎక్కువ గానే ఇక్కడ దొరుకుతుంది. ఇది కూడా నీటు గా ఉన్నా ఎ చోటైనా పరవాలేదు.మరీ ఓపిక ఉంటే తాడ్ దేవ్ లో ఉన్న సర్దార్ పావ్ భాజీ ట్రై చెయ్యొచ్చు .ఇంకా శివసాగర్ రెస్టారెంట్ చెయిన్ లో టేస్ట్ బాగనే ఉంటుంది .
భేల్ :మన మూరీలు అదే మురమురాలు తో ఉల్లి మిర్చి నిమ్మ రసం ఇంకా మసాలాలు కలిపి చేసే స్నేక్ .ఇందులో కూడా చాల రకాలు ఉంటాయి. గీలా(తడి) ,సూఖ (పొడి) , సేవ్ పూరి ,దహీ పూరి మొదలైనవి.అ బీచ్ చౌపాట్టి లోనైనా ట్రై చెయ్యొచ్చు. కాస్త ఎక్స్పెంసివ్ కావాలంటే కైలాష్ పర్బత్ అనే చాట్ స్పెషల్ చైన్ ఉన్నాయ్ అక్కడ మీరు రుచిని ఆనందించ వచ్చు.
మిసల్ పావ్ :ఇది పావ్ తో పాటు సేవ్(మన జంతికల ముక్కలు) బఠానీలు వేసి చేసిన రస్సా (మరాఠీ మసలాల తో చేసిన రసం లాంటి సూప్ ) సర్వ్ చేస్తారు.
దక్షిణ భారత వంటకాలు: ఇక్కడికి వచ్చినా మీకు మన రుచులే కావాలంటే ...
మాటుంగా : ఇది ఒక ప్రాంతం పేరు ...ఇది ఒక దక్షిణ భారత సేటేల్మెంటు.కొన్ని ఫేమస్ హోటల్ లలో మద్రాస్ కెఫే,రామ నాయిక్ ,మైసూర్ కెఫే ముఖ్య మైనవి .వేడి వేడి ఇడ్లీలు సాంబారు స్ట్రాంగ్ కాపీ మన సాంప్రదాయక రసం కావాలంటే మాటుంగా రోడ్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఈ హోటళ్ళలో రుచి చూడ వలసిందే.
వీ టీ: స్టేషన్ బయట కార్పోరేషన్ బిల్డింగ్ ఎదుట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న సౌథ్ కార్నెర్ ,చూడడానికి రోడ్ సైడ్ షాపే గాని రుచి కరమైన ఇడ్లీలు దోసలు ఇక్కడ స్పెషల్.ఆ పక్కనే ఖాలఖట్ట పానీయం అమ్మే దుకాణం కూడా ఉంది.
ఖావు గల్లి :ఇది మన వీ టీ కి దగ్గర లోనే ఝావేరీ బజార్లో ఉంది.ఖావు గల్లి అంటే చిరు తిళ్ళు అమ్మే సందు అన్న మాట. ఇలాటి గల్లీలు ముంబై లో చాల మటుకే ఉన్నాయి.
చివడా గల్లీ :ఇది లాల్ బాగ్ లో ఉంది.ఇక్కడ సందులో అన్నీ చివడా(చూడా - అటుకులతో చేసిన ఒక స్నేక్) అమ్మే దుఖాణాలే.రకరకాల చూడా ఇక్కడ కొనుక్కోవచ్చు . సమాంతరంగా ఉండే సందు ఆచార్ గల్లి (ఆచార్ అంటే ఆవకాయ )ఇక్కడ అన్ని రకాల ఉత్తర భారత ఆవకాయలు లభిస్తాయి.
రెస్టారెంట్లు,హోటళ్లు :వీటికి ఇక్కడ ఏమీ కొదవ లేదు.మన కన్నడ ,గుజరాతీ సోదర్లు ఇక్కడ చాల మట్టుకు ఈ వ్యాపారంలో చాల రోజులనుంచి ఉన్నారు .కాక పొతే కాస్త ఖర్చు ఎక్కువ పెట్టాలి ఇక్కడ.దగ్గర దగ్గర ఒక తలి కి రూ.200 చొ. ఉంటుంది .
రాజధాని :ఈ రెస్టారెంట్ లు గుజరాతీ /రాజస్థానీ థాలీలు సర్వ్ చేస్తాయి.మంచి నాణ్యత ఉన్న భోజనం కడుపు నిండా ఇక్కడ ఆనందించ వచ్చు.
టిప్ టాప్ : వీళ్ళు మరాఠి/ పంజాబీ థాలి సర్వ్ చేస్తారు .భోజనం నాణ్యత కూడా బాగుంటుంది .ఐతే ఇది థానే లో మాత్రమె ఉంది.
చేతన :ఈ రెస్టారెంట్ కాలఘోడ ,జేహన్గీర్ ఆర్ట్ గేలరీ దగ్గరలో ఉంది.గుజరాతీ /రాజస్థానీ థాలీలు సర్వ్ చేస్తారు.
స్టేటస్ :ఇది నారిమన్ పాయింట్ లో ఉంది .వీళ్ళు కూడా గుజరాతి థాలి ముఖ్య మెనూ గా సర్వ్ చేస్తారు.
సామ్రాట్ :ఇది చర్చ్ గేటు ఏరియా లో ఉంది.నగరం లో ప్రముఖ మైన థాలి రెస్టారెంట్లలో ఒకటి.గుజరాతీ ,పంజాబీ థాలి ఇక్కడ ముఖ్య ఆకర్షణ.
కేప్ మొండేగర్:ఇది కొలాబా లో ఉంది.వీలయితే ఇక్కడ కూడా కొంత సేపు గడపొచ్చు.ఇది ఒక మల్టీ క్యుసినే అనొచ్చు.లోపలి గోడలు మేరియో మిరాండా కార్టూన్లతో అలంకరిచబడి ఉంటాయి.చాల హుందాగా ఆకర్షణీయమైన అంతర పనితనం మనకి కనపడుతుంది ఇక్కడ.ఇక్కడ కపుల్స్ కి ఇదొక హేంగ్ అవుట్.

ఇవే కాకుండా మిగిలిన కేప్ కాఫీ డే ,బరిస్తా ,పిజ్జాహట్ ,డామినోస్ ,మెక్ డొనాల్డ్స్ లాంటి హంగ్ అవుట్ లు కూడ మీరు చూడా వచ్చు.

6 comments:

  1. ముంబైలోనూ పుణేలోనూ పావ్ భాజీ .. ఆ టేష్టే వేరు!

    ReplyDelete
  2. mana arora theatre gurundi raayaledu matunga flyover prakkana ippudu metro work jaruguthondi..matunga station prakka hotel peru udipisriramakrishna full meals ninnati nundi penchadu

    ReplyDelete
  3. " కచ్చీ దాబ్లీ " గురించి రాయలేదే బాబూ. నచ్చదా. మా కు పుణే లో అయితే చాలా బాగుంటుంది !!!

    ReplyDelete
  4. wow chala manci information, naku bombay telusu kani ila specific ga teledu, ee sari vachinapudu compulsory ga try chesta

    ReplyDelete
  5. hare Phala ..! Hare Phala..! ruchiki Daabeli chaala baaguntundi...kaaka pote ikkada nenu utankinchinadi mumbai lo kaassta ekkuva praamukhyam unna vaati gurinchi...naa next raata gujarat nagaraala gurinche...so andulo ne chepta..

    Hare krishna hare krishna...avunavunu mari...

    hemant gaaru tappakunda!

    ReplyDelete